Telugu News

నేలకొండపల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్

0

నేలకొండపల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయం న్యూస్);-
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడంతో దానికి నిరసనగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల అంజనీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజికవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

also read :-వ్యవసాయానికి రాహుల్ సభ దశ దిశ నిర్దేశం చూపిస్తుంది

ఈ సందర్భంగా జెర్రిపోతుల అంజనీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులని ఉస్మానియా లోకి అనుమతించక పోవడం సిగ్గుచేటు అని విమర్శించారు, అంతేకాకుండా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు బలమూరి వెంకట్ తో పాటు 18 మంది i నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం అని, యూత్ కాంగ్రెస్, నాయకులపై పెట్టిన అక్రమ కేసులు కూడా ఎత్తివెయ్యాలి అని డిమాండ్ చేశారు.

also read :-వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి ని కలిసిన కాంగ్రెస్ నేతలు…

ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు,కోరట్లగూడెం ఎంపీటీసీ రేగురి వాసవి,నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు దోసపాటి శేఖర్,జిల్లా బీసీ సెల్ నాయకులు బోయిన వేణు, మండల కిసాన్ సెల్ నాయకులు గట్టిగొండ్ల వెంకన్న, రాయపూడి నారాయణరావు, అనంత్ సత్యనారాయణ,సోడుపొంగు వెంకన్న,బచ్చలకూరి ఆంధ్రబాబు, నేలకొండపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, పగిడికత్తుల సుదర్శన్, యతాకుల శ్రీనాథ్, వంగూరి బాలాజీ, కాసాని సీతారాములు, దేవరశెట్టి మురళి, రాచకొండ అయ్యప్ప,భూక్యా మనోజ్, కొప్పు సాయి, షఫీ, గట్టిగొండ్ల తిరపతి,నరేంద్ర,ఖమ్మం భరత తదితరులు పాల్గొన్నారు.