Telugu News

ప్యారివేర్, జాన్సన్ టైల్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్సీ మధు, మేయర్

ఖమ్మం-విజయం న్యూస్

0

ప్యారివేర్, జాన్సన్ టైల్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్సీ మధు, మేయర్

(ఖమ్మం-విజయం న్యూస్);-
కార్పొరేషన్ పరిధిలో గల 55వ డివిజన్ బైపాస్ రోడ్డు నందు రాందేవ్ బాబా గ్రానైట్ అండ్ మార్బుల్స్ వారిచే నూతనంగా ఏర్పాటు చేసిన ప్యారి వేర్, జాన్సన్ టైల్స్ షాపును శనివారం ఎమ్మెల్సీ తాతా మధు, నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక కార్పొరేటర్ మోతరపు. శ్రావణి సుధాకర్, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, దిండిగాల రాజేందర్, కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, దండా జ్యోతి రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు రవి కిరణ్, కొప్పు నరేష్ చిన్ని కృష్ణ రావు .చెరుకూరి మూర్తి , చైన్ సింగ్ ,హనుమంతరావు, రాయల. నాగేశ్వరరావు, ఖమ్మం పుర ప్రముఖులు పాల్గొన్నారు.

also read :-చేగొమ్మ హెచ్ ఎం సస్పెండ్
== స్వచ్ఛ ఆటోను ప్రారంభించిన మేయర్
ఖమ్మం నగరంలోని పలు డివిజన్లోని వేణుగోపాల్ నగర్ లో స్వచ్ఛ ఆటో ను ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పారిశుధ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తో పాటు కార్పొరేటర్లు నాగండ్ల.కోటేశ్వరరావు దండా జ్యోతి రెడ్డి, నాయకులు. చిరుమామిళ్ల రవికిరణ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.