Telugu News

ఎం.వెంకటాయపాలెం లో ఏపీఓ ని గెరావ్ చేసిన ఉపాధిహామీ కూలీలు

ఖమ్మంరూరల్/కూసుమంచి-విజయం న్యూస్

0

ఎం.వెంకటాయపాలెం లో ఏపీఓ ని గెరావ్ చేసిన ఉపాధిహామీ కూలీలు

(ఖమ్మంరూరల్/కూసుమంచి-విజయం న్యూస్);-

ఖమ్మం రూరల్ మండలం, ఎం వెంకటాయపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజు కూలీ కేవలం రూ.30 మాత్రమే పడుతున్నాయని, రోజుకు రూ.257 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈజీఎస్ ఏపీవో శ్రీదేవిని శనివారం గెరావ్ చేశారు. శనివారం కూలీ పనులు నిలిపివేస్తూ నిరసన చేశారు. అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న కూలీలకు ఏఐకెంఎస్ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వారు ఆందోళనలో పాల్గొన్నారు.

also read :-ఉగ్ర కుట్ర పై అలర్టైన పోలీస్ యంత్రాంగం

ఎండలో పని చేస్తున్న కూలీలకు టెంటు ఏర్పాటు చేయటం లేదని, మంచినీళ్లు అందించడం లేదని, భద్రత సౌకర్యాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య విమర్శించారు.కూలీలకు అధికారులు మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరావు, ఆవుల వెంకటేశ్వర్లు , జిల్లా నాయకులు బందెల వెంకయ్య, కుర్ర వెంకన్న, రెంటాల యాదగిరి, గ్రామ సర్పంచి మందాటి సంధ్యారాణి, మండల నాయకులు ఆవిరేని వెంకన్న, తోకల పెద్ద వెంకన్న, తోకల ఉపేందర్, తోకల చిన్న వెంకన్న, బుర్ర ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.