Telugu News

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ

బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణదే (బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ

0

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ

===బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణదే (బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ

===టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ

===టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ – కాంగ్రెస్ లు కలిసి కుట్రలు

===మహబూబాద్ లో బీజేపీ- కాంగ్రెస్ లపై నిప్పులు కురిపించిన

ఆర్థిక,వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

(మహబూబాబాదు జిల్లా  విజయం న్యూస్):-
మహబూబాబాదు జిల్లా ప్రధాన ఆసుపత్రి నూతన భవనానికి, రు. 510 కోట్లతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

అంతకుముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్,
డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంబించిన ఆర్థిక ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.
—————————————
మంత్రి హరీశ్ రావు కామెంట్స్
————————————-
మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి అయింది.

మానుకోట ఉద్యమాన్ని దశ-దిశ తిప్పడంలో పోరాడింది. తెలంగాణ వచ్చింది కనుకనే…మాను కోట జిల్లాగా మారింది. ఈ మానుకోటలో మెడికల్ కాలేజి శంకుస్థాపన చేసుకున్నం.550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్తాపన చేసుకోవడం చిన్న విషయం కాదు. నిజంగా తెలంగాణ రాకపోతే ఇది అయ్యేదా..తెలంగాణ రాకముందు 3 మెడికల్ కాలేజిలు మాత్రమే వచ్చాయి. 75 ఏళ్లు కాంగ్రెస్,టీడీపీలు పాలించాయి. నిజామాబాద్,ఆదిలాబాద్, వరంగల్ లో మాత్రమే వచ్చాయి. ఏడేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెడుతున్న ఘనత సీఎంకేసీఆర్ ది.సీఎం కోరిక పేదలు నాణ్యమైన వైద్యం పొందాలి, పేదవిద్యార్థులు మెడికల్ చదువుల చదవాలని ఈ ప్రక్రియ ప్రారంభించారు. సర్కారు దవాఖానాల్లో కార్పోరేట్ వైద్యం అందాలి.

also read :-ఆ ఇద్దరికి నో చాన్స్..?

ప్రయివేటు 700 మెడికల్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో తెలంగాణ రాకముందు ఉండేవి. ఏడేళ్లలో 2840 మెడికల్ సీట్లకు పెంచుకున్నం. రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 5420 మెడికల్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండనున్నాయి.పిల్లలకు చదువులు రావాలి. గిరిజన విద్యార్థులు డాక్టర్లు కావాలని సీఎం ఆకాంక్ష. మహబూబాద్ లో చదువుకునే అవకాశం కలుగుతుంది.మహబూబాద్ లో వంద పడకల ఆసుపత్రి ఉండేది. పది మంది డాక్టర్లు ఉండేవి. రేపు 650 పడకలకు పెరగనుంది. వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు.ఇంత కాలం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి పెద్దాపరేషన్ల పేరు మీద ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ప్రభుత్వ ఆసుపత్రులకు రండి. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నం. అన్ని రకాల వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు ఉపయోగించుకోండి.అర్భన్ పీహెచ్ సీ బిల్డింగ్లేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదన్నరు. 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేస్తున్నం. మహబూబాద్ లో అర్భన్ పీహెచ్ సీ పక్కా భవనం కట్టిస్తం. అయోధ్యపురం పీహెచ్ సీ బిల్డింగ్ లేదన్నరు. దానికి మరో 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేసి పక్కా భవనం కట్టిస్తం. 15 చోట్ల రెంటెండ్ బిల్డింగ్స్ లో ఎ.ఎన్.ఎం సెంటర్ ఉన్నయి పక్కా భవనాలు లేవన్నరు. వాటికి నిధులు 20 లక్షలు ఒక్కోదానికి మంజూరు చేస్తం.

also read ;-పిట్ట కొంచెం…. కూత ఘనం..,

మరిపెడ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తం. పల్లె దవాఖానా నర్సింహపెటలో అందుబాటులో తెస్తం. బలపాల పీహెచ్ సీ బిల్డింగ్ లేదన్నరు. దానికి 2 కోట్ల 20 లక్షలు మంజూరు చేస్తం.తొర్రూరు ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తం.పెద్ద వంగరలో పల్లే దవాఖానా అడిగారు. దాన్ని మంజూరు చేస్తం75 ఏళ్లకో కాని పనులు, ఏడేళ్లలో జరుగుతున్నయి. 24 గంటల కరెంటు కనురెప్ప పాటు కోత లేని కరెంటు వస్తది అని. చత్తీస్ ఘట్, ఏపీలో 6 గంటల కోతలున్నయి. దేశంలో కోతలున్నయి. దేశ రాజధాని ఢిల్లీలోకరెంటు పోతున్నయి. కాని మహబూబాద్ మారుమూల తండాలో 24 గంటల కరెంటు ఇస్తున్నరు. 24 గంటల కరెంటు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు రాదన్నరు. చీకటి అవుతుంది తెలంగాణ అన్నడు. మనకు వెలుతురు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డికి చీకటి వచ్చింది. తెలంగాణ తెచ్చిన పట్టుదల గల నాయకుడు కేసీఆర్ గనుక కరెంటు వచ్చింది.

రైతు బంధు 14 వేల కోట్లు ప్రతీ సంవత్సరం కేసీఆర్ ఇస్తున్నరు. ఇది అడిగామా మనం. మన ప్రభుత్వం 12 వేల ఉచిత కరెంటుకు ఖర్చు చేస్తునం. రైతు బీమామీద 1500 కోట్లు, ఇరిగేషన్ మీద ఏడాదికి 30 వేలకోట్లు ఖర్చు. మార్కెట్ యార్డులు, సకాలంలోవిత్తనాలు అందిస్తున్నం. ఇదంతాడీబీఎం 48 లో నీళ్లు మనం చూసినమా…నడ్డా వచ్చిండు మొన్న. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఒక్క ఎకరానికి రాలేదన్నడు. ఆయన్ను తెచ్చి డీబీఎం 48 లో ఎత్తేస్తే తెలుస్తది. వెన్నారం దాకా నీరు పారుతున్నయంటే కాళేశ్వంర నీరు మిడ్ మానేరులోపడ్డయి. మిడ్ మానేరు నుండి ఎస్సారెస్పీ నుండి వెన్నారం దాకా నీరు వచ్చినయి.కాని బీజేపీ వాళ్లు ఒక్క ఎకరానికి నీళ్లు వచ్చినయా అని అడుగుతు్న్నరు. మా సిద్దిపేటకు రా..దుబ్బాకకు రా..గజ్వేల్ కు రా,,డోర్నకల్ రా.. కాళేశ్వరం నీటితో పంటలు పండుతున్నయా లేదా చూడు. మా రైతులు చెబుతురు.

also read :చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

బీజేపీ వాళ్లు చెప్పేవి అబద్దాలు. అబద్దాలకు నోబెల్ ప్రైజ్ ఇస్తే అది బీజేపీకే వస్తది. కాళేశ్వరం నీరు రాలేదంటే ఇంతకన్న జూటా మాట ఉంటదా..సలన్నీ మేం ఇస్తున్నమని అంటున్నరు. ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పది వేల రూపాయలు ఇస్తున్నం ఒక్క రూపాయి ఉందా మీది, కేసీఆర్ కిట్ లో ఒక్క పైసా ఉందా మీది. అన్నీ అబద్దాలు. ఈ పార్టీలు తెలంగాణకు హని చేస్తున్నయి.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పని చేసే పార్టీ. ఈ జాతీయపార్టీలు తెలంగాణకు హని చేస్తున్నాయి. తెలంగాణకు పని చేసే పార్టీలు ఉండాలా…. హని చేసి పార్టీలు ఉండాలా..కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టు కట్టవద్దని కేసు వేస్తడు. బీజేపీ వాడు కాళేశ్వరం ఆపాలని కోర్టుల్లో కేసులు వేస్తడు. మిషన్ భగీరథ పనులు ఆపాలని, ఎంక్వైరీ చేయాలని ఉత్తరం రాస్తరు. మీరుఏమీ చేయరు. చేసే టీఆర్ఎస్ పార్టీని అడ్డుకుంటరు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన ప్రకృతి లాంటి పార్టీ. జాతీయ పార్టీలు వికృత పార్టీలు. పనులు ఆగాలి. ప్రజలకు టీఆర్ఎస్ మీద కోపం పెరగాలని కుట్రలు చేస్తున్నరు. టీఆర్ఎస్అంటేనే తెలంగాణ జాతి పార్టీ. ఇంటి పార్టీ.క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది. రాబోయే రోజుల్లో తండాల్లోని ప్రతీ గ్రామపంచాయతీకి 25 లక్షలతో భవనాలు కట్టించుకుంటం. తండాల్లో బీటీ రోడ్లు వేయిస్తం. త్వరలోనే పింఛన్లు 57 ఏళ్లకే ఇస్తం.జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేసిందే తప్ప మేలు చేసిందేమి లేదు.బయ్యారం ఫ్యాక్టరీకి, గిరిజన యూనివర్సిటీకి,వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి అతీ గతీ లేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వరు. బాయిల కాడ మీటర్లు, బోర్ల కాడ మీటర్లు పెట్టమండరు. మీటర్లు పెడితే పైసలు ఇస్తం. లేదంటే ఇవ్వమని 25 వేల కోట్లు విడుదల చేస్తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నరు.

వడ్లు కొనమంటే, వడ్లు కొనమని ఇబ్బంది పెడుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వమే 3 వేల కోట్ల నష్టం బరిస్తూ వడ్లు కొంటున్నం.రోజు ఢిల్లీ నుండి వచ్చి ప్రజలపై దండయాత్ర చేస్తున్నరు.కాంగ్రెస్- బీజేపీలు ఒంటరిగా టీఆర్ఎస్ ను ఎదుర్కోలేమని కుట్రలు చేస్తున్నరు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షబీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజులు మంజూరు చేస్తే, ఒక్కటి ఇవ్వలే. టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ కాలేజీలు వచ్చేవా..నడ్డా  వచ్చి కాళేశ్వరం నీరు పారలేదన్నరు. డీబీఎం కాలువలో నీరువస్తుందా లేదా..బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. ప్రజలను రెచ్చగొట్టి నాలుగుఓట్లు సంపాందించే ప్రయత్నం చేస్తరు. ఆపార్టీను నమ్మవద్దు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  కామెంట్స్
హరీశ్ రావు డైనమిక్ లీడర్

కెసిఆర్ జిల్లా ఇస్తే, కాలేజీ ఇస్తే, నీళ్ళు ఇస్తే, మంచి నీళ్ళు ఇస్తే ఇంకెప్పుడు? అన్న వాళ్ళ నోళ్ళు మూసుకునే విధంగా మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతున్నది

జిల్లా కలెక్టరేట్ వచ్చి, పరిపాలన ప్రజల వద్దకు వచ్చింది

సీఎం కెసిఆర్  సృష్టించిన అద్భుతం ఇదంతా

అందుకే సీఎం కెసిఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి

వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ కొత్త పెన్షన్లు ఇస్తున్నాం

దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్న మహానుభావుడు సీఎం కెసిఆర్

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన పథకాలు లేవు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాపాలే ఇంకా వెంటాడుతున్నాయి

ఇక్కడ ఇస్తున్న హామీలను ముందు మీ రాష్ట్రాల్లో అమలు చేసి మాట్లాడండి

మహబూబాబాద్ జిల్లా వెనుక వేయబడింది. కాబట్టి మరిన్ని నిధులు ఇవ్వాలి

తొర్రూరు హాస్పిటల్ ను 100 పడకలకు upgrade చేయాలి

పెద్ద వంగర లో కొత్త హాస్పిటల్ ను మంజూరు చేయండి

కెసిఆర్ ను తిట్టే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి

కెసిఆర్ దయ వల్ల మహబూబాబాద్ ను మరింత అభివృద్ధి చేసుకుందాం

ఇందుకు హరీశ్ రావు సహకారం అవసరం

నా వంతు సహకారం ఎల్లపుడూ మహబూబాబాద్ కు ఉంటుంది

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్
ఈ రోజు మహబూబాబాద్ జిల్లాకు సుదినం

మహబూబాబాద్ జిల్లా ప్రజల తరపున సీఎం కెసిఆర్ కి, మంత్రి హరీశ్ రావు  కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు

ఈ ప్రాంతం
బీడు బడి తుమ్మలు మొలచినవి

ఆఖరి ఆయకట్టు వెన్నవరం వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మీది

తెలంగాణ సాకారం వల్లే, సీఎం కెసిఆర్ వల్లే ఇదంతా సాధ్యమైంది

ఈ రోజు అనూహ్యమైన, ఎవరూ అనుకోని విధంగా అభివృద్ధి చేస్తున్నారు

వెనకబడిన ప్రాంతానికి ఇంత వైభవం రావడం మా అదృష్టం

మా తండాల్లో మా పరిపాలనకు అవకాశం కల్పిస్తూ, తండాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు

మహబూబాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలి

మరిన్ని రోడ్ల అవసరం ఉంది

కొన్ని పార్టీలు ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నాయి

అలాంటి వాళ్ళను మన దరిదాపులకు రానీయ వద్దు

సీఎం ని నిండు మనసుతో దీవించాలి

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కామెంట్స్

మహబూబాబాద్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.

పని ఏదైనా అత్యంత పట్టుదలతో పూర్తి చేసే గొప్ప వ్యక్తి హరీశ్ రావు గారు.

భూములు కోల్పోయిన రైతాంగానికి సహాయం చేయాలి.

మా నియోజకవర్గం అభివృద్ధికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం

ఎమ్మెల్యే శంకర్ నాయక్ కామెంట్స్
మహబూబాబాద్ జిల్లా కావడమే ఎవరూ నమ్మలేదు.. కానీ ఈ రోజు 510 కోట్ల విలువైన మెడికల్ కాలేజీ, ఇతర సదుపాయాలు వచ్చాయి.

అనుబంధంగా ఇతర సదుపాయాలు కలుగుతున్నాయి

ఇది సీఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావు పుణ్యం

ఇంకా మా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు ఇవ్వండి