Telugu News

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మరణాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎడ్లపల్లి సంతోష్

(ఖమ్మం-విజయం న్యూస్)

0

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మరణాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎడ్లపల్లి సంతోష్

(ఖమ్మం-విజయం న్యూస్);-
ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ గారు మాట్లాడుతూ భరత్ దేశంలో కోవిడ్ మరణాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్నారు.భరత్ దేశంలో 47 లక్షల మంది కరోనా బారిన పడి మరణించారని W.H.O నివేదిక.కానీ మోడీ బిజెపి ప్రభుత్వం మే 6వ తేదీన సెంట్రల్ రిజిస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కేవలం 5 లక్షల మంది మరణించారని తప్పుడు లెక్కలు చూపిస్తుంది అని అన్నారు.

also read :-ములుగు తెరాస టికెట్ రేసు లో డాక్టర్ సాంబశివరావు?

కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు సరైన వైద్యం అందిచకపోవడం వల్ల దేశంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రలో కే.సి.ఆర్ ప్రభుత్వం 4,111 అని నివేదిక సమర్పించింది కానీ హిందూ పేపర్ నివేదిక ప్రకారం కేవలం హైదరాబాద్ GHMC పరిధిలో లక్ష పైగా ఉండొచ్చని అంచనా.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మనకు ఉన్న లెక్కల ప్రకారం 2.5 నుండి 3 లక్షల మంది కరోనా వైరస్ బారినపడి చనిపోయారు అని అన్నారు.

also read :-భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

గ్రామ స్థాయి నుండి సర్వే నిర్వహించి కరోనా బారిన పడి మరణించిన ప్రతి కుటుంబానికి 50,000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ కోవిడ్ మరణాల సంఖ్య తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి 6,7 నెలలు అయింది, కానీ ఆ కమిటీ నేటి వరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్, పాలేరు అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం మహేష్ యాదవ్, ఖమ్మం అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ బానోత్ కోటేష్ నాయక్, నెలకొండపల్లి, ఖమ్మం రూరల్,కుసుమంచి మండల కో-ఆర్డినేటర్స్ కుక్కల నరేష్, కోటి రమణ,నూనావత్ బిక్షం ఖమ్మం అసెంబ్లీ నాయకులు దుంపటి సందీప్, బానోత్ వెంకటేష్ తదితరులు