Telugu News

ఖమ్మం కార్పొరేషన్ కు శుభవార్త

**  రాష్ట్రస్థాయి అవార్డు గెలుచుకున్న ఖమ్మం కార్పోరేషన్

0

ఖమ్మం కార్పొరేషన్ కు శుభవార్త

 

**  రాష్ట్రస్థాయి అవార్డు గెలుచుకున్న ఖమ్మం కార్పోరేషన్

 

** మంత్రి పువ్వాడ కు అందజేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

 

(ఖమ్మం-విజయంన్యూస్)

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యేకతను కనపరిచిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాదులో లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకున్నారు.

also read :-అప్పుల వల్ల  ఆత్మహత్య చేసుకున్న రైతు  కుటుంబాన్ని ఆదుకోవాలి

ఈ సందర్భంగా మంత్రి  కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మంత్రి అజయ్ సారథ్యంలో తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా మున్సిపల్ పాలకవర్గానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ మంత్రి పువ్వాడ చేస్తున్న ప్రగతిని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఆవార్డు అందజేసే అభినందనలు తెలిపారు.