Telugu News

ప్రజలకు చేరువగా నాయకులుండాలి

టీపీసీసీ అధికార ప్రతినిది కోటూరి మానవతారాయ్

0

ప్రజలకు చేరువగా నాయకులుండాలి

 

—-టీపీసీసీ అధికార ప్రతినిది కోటూరి మానవతారాయ్

 

—-పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో విస్తృత పర్యటన

 

(కల్లూరు విజయం న్యూస్):-
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కార్యకర్తలను సమాయత్తం చేస్తోన్న…కోటురి మానవతా రాయ్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రేసు కార్యకర్తలను సమన్వయ పరిచేందుకు విస్తృత పర్యటన కొనసాగిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన శనివారం కల్లూరు మండలంలో లక్ష్మీపురం, కల్లూరు, చండ్రుపట్ల ,రఘునాథ గూడెం, చెన్నూరు, లింగాల, పాయపూరు పలు గ్రామాల్లో పర్యటించారు.ఈ క్రమంలో మండలంలో ముఖ్య అనుచరులను,కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ అభిమానులను, ఆయన పలకరించి పార్టీ పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు .అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశానుసారం మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తున్న టు తెలిపారు.

also read;-అప్పుల వల్ల  ఆత్మహత్య చేసుకున్న రైతు  కుటుంబాన్ని ఆదుకోవాలి
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి కార్యకర్త , నాయకులు ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు .కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని సూచించారు .వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించాలని కోరారు. అదే క్రమంలో అధికార పార్టీ వైఫల్యాలను కూడా తెలియజేయాలని కోరారు. వరంగల్ డిక్లరేషన్ లో పార్టీ ప్రకటించిన ప్రధాన అంశాలు

also read;-వలస కార్మికులకు అండగా ఉంటాం: ఎండీ.జావిద్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రైతు రుణమాఫీని ఏకకాలంలో రద్దుచేస్తామని,ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు పదిహేనువేలు ,భూమిలేని ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది.రైతులకు సరైన మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించి, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని,భూమిలేని రైతుకూలీలకు రైతు బీమా అందేలా చేస్తామని ,సరికొత్త రెవిన్యూ వ్యవస్థతో ధరణి పోర్టల్ ను రద్దు చేస్తూ అందరి భూములకు రక్షణ కల్పిస్తామని అన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన ప్రణాళికతో ప్రజలకు అనువైన మ్యానిఫెస్ట్టోతీసుకువస్తుందని తెలిపారు. మేనిఫెస్టోను కచ్చితంగా ప్రజల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుని, కార్యకర్తపై ఉంటుందని తెలిపారు .

also read;-యువత పోటీ పరీక్షలకు సిద్దంగా ఉండండి
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూక్య శివకుమార్ నాయక్,జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామాల రాజు వల్లభనేని బాబు,పసుమర్తి మోహన్రావు , మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీలం బ్రహ్మారెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లాలయ్య,ఎంపీటీసీ లక్కిరెడ్డి గోపిరెడ్డి,మాదిరాజు లక్ష్మణరావు,దామాల జ్యోతి ,బీసీ సెల్ నాయకులు పాస౦ నాగేశ్వరరావు,మండల మైనార్టీ సెల్ నాయకులు యస్ కె బాజీ , ఏసు, వైకుంఠం బాబురావు, ఎస్టీ సెల్ మండల నాయకులు గుగులోతు సీతారాం, మండల సోషల్ మీడియా అధ్యక్షులు శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు