Telugu News

మంత్రి అజయ్ తో టీఆర్ఎస్ నాయకుల సమావేశం

కొణిజర్ల/ఖమ్మం-విజయం న్యూస్

0

మంత్రి అజయ్ తో టీఆర్ఎస్ నాయకుల సమావేశం

(కొణిజర్ల/ఖమ్మం-విజయం న్యూస్);-

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం అభివృద్ధికి సహకరించాలని మరియు మత్స్యకారులు, రైతుల రవాణా సౌకర్యం కోసం లాలాపురం నుంచి వైరా వెళ్ళే 4 కిలోమీటర్ల బీటీ రోడ్డును నిర్మించాలని మంత్రి పువ్వాడను కోరారు.

also read;-వరంగల్ డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి

మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్ నాయకులు దామా సత్యనారాయణ (సత్యం) దామా వీరయ్య, పాషా, కూరాకుల నారాయణ తదితరులు ఉన్నారు. నాయకుల విజ్ఞప్తులకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్.. వెంటనే ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వ దీప నైవేద్య పథకం వర్తింపజేస్తూ మంత్రి అజయ్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బిటి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.