Telugu News

ఖమ్మంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం-విజయం న్యూస్

0

ఖమ్మంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

(ఖమ్మం-విజయం న్యూస్);-

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా ఖమ్మం వీడియోస్ కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, మాజి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం మాట్లాడారు. బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఖబర్ధార్ అంటూ సవాల్ చేశారు.

also read :-సస్పెండ్ చేసే అధికారం మండల అధ్యక్షునికి లేదు

అభివద్ది ప్రధాత మంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర నాశనాన్ని కొరుకునే బీజేపీ పార్టీకీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గురించి, తెలంగాణ మంత్రుల గురించి మాట్లాడే హక్కు కూడా లేదన్నారు. అనంతరం ర్యాలీగా ప్రధాన రహధారికి చేరుకుని బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా ఛైర్మెన్ విజయ్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, ఖమ్మం ఏఎంసీ చైర్మెన్ లక్ష్మిప్రసన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణా, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్, దాదే అమృతమ్మ, సరిపుడి రమాదేవి, గోళ్ళ చంద్రకళ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటేముక్కల వెంకటేశ్వర రావు, నాయకులు బొమ్మర రంమూర్తి, వీరు నాయక్, చింతనిప్పు కృష్ణ చైతన్య, కొల్లు పద్మ, కుర్రా భాస్కర్ రావు, తదితరులు అన్నారు.