పల్లెల్లో మారుతున్న రాజకీయం………
ఓవర్ లోడ్ తో సతమతమౌతున్న టిఆర్ఎస్.,….
అధికారమే లక్ష్యంగా పట్టు బిగిస్తున్న కాంగ్రెస్……..
ఐక్యంగా కమ్యూనిస్టుల పోరాటాలు…….
బహుజనులను ఏకం చేస్తున్న బిఎస్పి…..
స్థానికంగా బలపడుతున్న బిజెపి…..
( చండ్రుగొండ విజయం న్యూస్ ): –
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…. ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, బిఎస్పి రాజకీయ పార్టీలు నిత్యం ఏదో ఒక సమస్యలపై, ధర్నాలు సమావేశాలు, బహిరంగసభ లు పెడుతూ జనాన్ని ఆకర్షించడానికి ఎన్నికల నాటికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు… ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలు…. 2018 తెలంగాణ రాష్ట్రంలో అప్పటి,ఇప్పటి ప్రభుత్వం ముందస్తు ఎలక్షన్ లో కెళ్ళి విజయం సాధించింది…. కానీ అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులు, మరియు ప్రధాన పార్టీలైన ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా తయారవుతున్నాయి….
ప్రతి విషయం కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పోరాడుతున్నాయి……పార్టీలు, పార్టీ స్థితిగతులు తెలుసుకుందాంతెలంగాణ రాష్ట్ర సమితి…….ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనలో ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం తెలిసిందే….ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన కష్టాలు తొలగిపోతాయని ఎవరికివారు ప్రకటనలు జారీ చేశారు…ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్న తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బంగారు తెలంగాణా చేస్తానని హామీలు ఇచ్చారు….
also read ;-==తిరుమలాయపాలెం మండలంలో వ్యక్తి ఆత్మహత్య
కానీ ఆచరణలో మాత్రం శూన్యం… తెలంగాణలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నది…. తెలంగాణ వస్తే ఉద్యోగుల వస్తాయనుకున్న మన యువత ఇప్పటి పరిస్థితి చూస్తే….. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా తయారైంది. రాష్ట్ర సాధన కోసం అన్ని వదులుకునే పోరాటం యువత నేడు మధ్య వయసుకు చేరి కుటుంబాలు పోషించలేని దుర్భర స్థితిలో జీవితం సాగిస్తున్నారు.. జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి.. అన్నిటికీ ఆగమై పోతున్నారు… ఆత్మ చంపుకోలేక పదిమందిలో తల ఎత్తు కోలేక జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు….. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు ఖాయం అనుకున్నా యువత.. రాష్ట్రం తెచ్చుకోవడం కోసం ప్రాణాలు అర్పించారు.. రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడిచినా ఆ అమరుల ఇప్పటికీ నెరవేరలేదు…. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఘోష… వారి కుటుంబాల ఆవేదన నిరుద్యోగుల ఎదురుచూపులు మళ్లీ యువత ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితి రావటం….. వీటన్నిటికీ అమరుల త్యాగాలను ఫలితాలను అనుభవిస్తున్న పాలకులు చెప్పాల్సిందే…..
అలాగే మరొక ప్రధానమైన సమస్య,. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషనన్ ప్రభుత్వ పరంగా ఆలస్యమైన ఈ సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.. కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదు హామీలు ఒట్టి మాటలేనా అని నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూములు ఇస్తానని… అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేస్తానని హామీ ఇచ్చారు…. కానీ నేటికీ కూడా అక్కడక్కడ మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి అందించారు…. కానీ ఇదే డబుల్ బెడ్రూం విషయంలో స్థానికంగా ఉన్న ప్రజలు డబల్ బెడ్రూమ్ నిర్మాణాలు అధికారంలో ఉండే కాంట్రాక్టర్లకు తప్పా సామాన్యులకు ఒరిగింది ఏదీ లేదని బహిరంగంగా చర్చించుకుంటున్నారు…..
also read :-=సేవాలాల్ మహారాజు సంక్పలంతో పనిచేయండి: కందాళ ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పోడు భూమి సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం అడవులు ఏజెన్సీ జిల్లాలో ఉండటం వలన ఇక్కడ పోడు సాగు వ్యవసాయం అనాది కాలంగా నుంచి వస్తుంది…. ఈ పోడు భూమి విషయంలో ప్రభుత్వాలకు మరియు పోడు సాగుదారులు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది…. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు గిరిజనులులపై కేసులు,లాఠీచార్జీలు సాగు చేసుకున్న భూమిని దున్నటం మహిళా లను జైలుకు పంపించడం వంటి ఈ సంఘటనలు కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు చేస్తున్నాయి….ఈ మధ్యకాలంలో దళితులకు దళిత బందు పేరట దళితులను లక్షాధికారులను చేస్తానని దళితుల ఇళ్లల్లో నిత్యం కాంతులు వెదజల్లాలి అని ఈ పథకాన్ని రూపొందించారు… కానీ అర్హులైన దళిత పేదలకు అది అందట్లేదని అధికార పార్టీకి చెందిన వాళ్ల అనుచరులకు ఇస్తున్నారని నిజమైన దళితులకు అందట్లేదని బహిరంగంగా చర్చించుకుంటున్నారు….
also read :-1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..
ఈ పథకాన్ని పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కనుసన్నల్లో జరగాలని ఇలాంటి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా దళితులకు చేయాలని వివిధ పార్టీలు సైతం ధర్నాలు, సభలు కూడా నిర్వహిస్తున్నాయి….తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండోసారి కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వచ్చిన కానీ వివిధ పార్టీల్లో గెలిచిన శాసనసభ్యులు ని పార్టీలో చేర్చుకుని పటిష్టంగా ఉందనే భావన లో తెరాస ప్రభుత్వం ఉంది…. కానీ అంతరంగ కుమ్ములాటలో పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది….. ప్రభుత్వంలో ఒకరికి ఒకరు సహకరించు కునే పరిస్థితి లేదు… వివిధ పార్టీల నుంచి వచ్చినవారికి పాత నాయకుల మధ్య పార్టీ పూర్తిగా నమో అయిపోయిందనే భావన లో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు…
అధికారమే లక్ష్యంగా పట్టు బిగిస్తున్న కాంగ్రెస్……తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మేనని గట్టిగా ప్రజలకు తెలియజేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైంది….. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత చేసుకున్న విభేదాలు వలన పార్టీ ఏ కనుమరుగయ్యే స్థాయికి చేరుకొన్నది… కానీ గత సంవత్సర కాలం నుండి అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను, కాంగ్రెస్ పార్టీ సమర్థమైన నాయకుని ఎంచుకునీ అధికార పార్టీ ఆగడాలను, అధికార పార్టీ చేస్తున్న ఒంటెద్దు పోకడలను ప్రజల్లో కలిసి ప్రజల్లో మమేకమై సామాన్య జనానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరవేస్తున్నారు… అదేవిధంగా పోడు భూమి సమస్య, డబల్ బెడ్ రూమ్ ల సమస్య, నిరుద్యోగ సమస్య, దళిత బంధు, దళిత దండోరా అని రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు ధర్నాలు, ప్రతి గ్రామగ్రామాన ఆందోళన.. నిర్వహించడం జరిగింది. గత ఆరు నెలల నుండి కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం పేరిట( రు.2 లక్షలు ) గ్రామ బూతు స్థాయిలో కార్యకర్తలను చేర్పించటం. ప్రతి కార్యకర్తకు భరోసా ఇవ్వడం జరుగుతుంది…. అదే విధంగా గ్రామాలలో ఉన్న అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా దీనిలో చేరటం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు గ్రామాల్లో,ప్రజలు చర్చించుకుంటున్నారు.
కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాటాలు……
పార్టీ సిద్ధాంతాలు వేరైనా, పార్టీ ఆశయాలు వేరైనా, సమస్య ఉన్నదంటే అక్కడ ఎర్రజెండాలు వలసిందే…. సామాన్య ప్రజల నుండి ప్రభుత్వ ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరు కూడా ఎర్ర జెండా నీడలో న్యాయం జరగాల్సిందే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కూడా నిత్యం సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వంతో కొట్లాడి పోరాడి, సామాన్య ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉన్నారు…. దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలను సైతం పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడని అన్ని రాష్ట్రాల నుంచి రైతులను ఢిల్లీ నడిబొడ్డున నిలబెట్టిన ఘనత ఒక్క కమ్యూనిస్టులకు చెందుతుంది…
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పోడు సాగు చేసుకునే గిరిజనులు, ఆదివాసీల కు మద్దతుగా పోడు భూమి సమస్యలు భుజాలపై మోస్తున్నది ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే…. అదేవిధంగా దళిత దళిత బంధు, ఉద్యోగ సమస్య, కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్వాడి,ఆశావర్కర్లు ప్రతి ఒక్క సమస్యపై పోరాడుతున్నారు కమ్యూనిస్టులు….. మళ్లీ పూర్వ వైభవం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు……సంస్థాగతంగా బలపడుతున్న భారతీయ జనతా పార్టీ….తెలంగాణ రాష్ట్రంలో 2018 జరిగిన శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది… తదనంతరం కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కి, షాక్ ఇచ్చి నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకున్న ది… అప్పటినుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టింది….
అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల అధికారపార్టీకి షాక్ అభ్యర్థిలను గెలిపించుకునంది… అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, నగరపాలక ఎలక్షన్లో సైతం బిజెపి గొప్ప ఫలితాలను సాధించింది…. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు… మరియు అధికార పార్టీలో అసంతృప్తి వాదులు సైతం పార్టీలో చేర్చుకుని అధికారమే లక్ష్యంగా పాదయాత్రలు, బస్సు యాత్రలు, ధర్నాలు, బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారు…బహుజనులను ఏకం చేస్తున్నా బీఎస్పీ……
also read :-=అభివృద్ధిలో మేడిదపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే కందాళ
తెలంగాణ రాష్ట్రంలో అధిక భాగం లో మేము ఉన్న రాజకీయ పార్టీలు మమ్మల్ని ఓటు బ్యాంకు కోసం ఏ తప్ప మమ్మల్ని అభివృద్ధి చేయడంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నా భావనలో బహుజన లు ఉన్నారు.. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( ఐపీఎస్) ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు…. రాష్ట్రంలో ఉన్న కుల వృత్తులలు, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను అధికారంలోకి తీసుకురావాలనీ అన్ని సంఘాలను ఏకం చేసి వల్లను చైతన్య పరుస్తూ ప్రతిష్ట మైన రాజకీయంగా శక్తిగా ఎదుగుతున్ననారు…