Telugu News

రోల్ మోడల్ ఖమ్మం మార్కెట్ చేస్తాం : మంత్రి

★ 10.34 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ నిర్మాణం

0

రోల్ మోడల్ ఖమ్మం మార్కెట్ చేస్తాం : మంత్రి

★ 10.34 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ నిర్మాణం

★ మంత్రి అజయ్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు

★ రోల్‌మోడల్‌ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం – మంత్రి పువ్వాడ వెల్లడి

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

ఖమ్మం జిల్లా రైతుల కల సాకారం కాబోతుందా..? ఇక నుంచి మార్కెట్ కష్టాలు పోతున్నాయా..? రైతులు ఇబ్బందులు అదిగించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందా..? అందుకు గాను నూతన సర్వ అంగులుతో మోడల్ మార్కెట్ ను నిర్మాణం చేయబోతున్నారా..? అంటే నిజమేనని అంటున్నారు.. టీఆర్ఎస్ నాయకులు.. దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్‌ కోసం ఎదురుచూసిన వ్యాపారులు, కార్మికులకు ప్రయోజనం చేకూరబోతున్నది. రూ.10.34 కోట్లతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ను నిర్మించనున్నారు. పొరుగు జిల్లాలకు సైతం ఈ మార్కెట్‌ ఆసరాగా నిలవనున్నది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో మార్కెట్ నిర్మాణానికి నిధులు విడుదల అయ్యాయి.
”’ఖమ్మం ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నది.

also read :-ములుగు టిఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ బరిలో పులుసం పురుషోత్తం ?

ఖమ్మం జిల్లా రైతుల ఆకాంక్షకు అనుగుణంగా నూతన మార్కెట్‌ను సర్కార్‌ ఏర్పాటు చేస్తున్నది. రోల్‌మోడల్‌ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం. గతంతో పోల్చుకుంటే జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట దిగుబడి పెరిగింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్‌ నిర్మిస్తాం. నూతన వ్యవసాయ మార్కెట్‌ అందుబాటులోకి వచ్చిన ఖమ్మం తర్వాత ఇతర జిల్లాల రైతులకూ ప్రయోజనం చేకూరనున్నది. మార్కెట్‌కు అప్రోచ్‌రోడ్‌, మౌలిక వసతులు కల్పిస్తాం. వ్యాపారులు, కార్మికులు, రైతులకు విశ్రాంతి భవనాలు అందుబాటులోకి తీసుకొస్తాం.”’ – పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి.