Telugu News

19 న తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ, మినీ ట్రాన్స్పోర్ట్ బంద్ ను జయప్రదం చెయ్యండి.

మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో ఖమ్మం నగరంలో ర్యాలీ

0

19 న తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ, మినీ ట్రాన్స్పోర్ట్ బంద్ ను జయప్రదం చెయ్యండి.

== మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో ఖమ్మం నగరంలో ర్యాలీ

== ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి తోట రామాంజనేయులు.

(ఖమ్మం-విజయం న్యూస్);-

ఫిట్నెస్ రెన్యువల్ పై రోజుకు రూ.50లు ఫెనాల్టీ, పెంచిన లైఫ్ టాక్స్ రద్దుకై 2022 మే 19 తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రవాణా బందు జయప్రదం చేయలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి తోట రామాంజనేయులు కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ లో గల మినీ ట్రాన్స్పోర్ట్ అడ్డా అధ్యక్షులు షేక్ యాసిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019 సం॥లో మోటారు వాహనాల చట్టం – 2019 ని తీసుకురావడం జరిగిందని. ఈ చట్టం కేవలం విదేశాలలో ఉన్న చట్టాల అనుగుణంలో మనదేశంలో మోటారు కార్మికులపై సేఫ్టీ పేరు చెప్పి భారీ ఛాలన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాపితంగా ఈ రవాణారంగ కార్మికులు అనేక ఆందోళనలు, సమ్మెలు చేయడం జరిగాయన్నారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించి మోటారు కార్మికుల నడ్డివిరిచి, వేలాది వాహనాలకు, లక్షలాది రూపాయల ఫెనాల్టీలు విధించిందని ఆయన వాపోయారు.

also read ;-ఖమ్మం మార్కెట్ కు మోక్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోటారు వాహనాల చట్టం 2019ని వ్యతిరేకిస్తూ సాక్షాత్తు రాష్ట్ర శాసన సభలోనే ప్రజలకు వ్యతిరేకమైన ఈ బిల్లును తెలంగాణాలో అమలు చేయనని చెప్పడం జరిగిందని ఆయన తెలియజేశారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అమలు చేయకపోయిన, రాష్ట్ర పోలీసులు “ఈ” ఛాలను పేరుమీద రూ.1035లు ఛాలనాను అమలు చేస్తున్నారన్నారు. ఈ ఛాలానాను అన్ని సంఘాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 1 నుండి జి.ఓ.నెం.714 ప్రకారం ఫిట్నెస్ రెన్యువల్ కాకపోతే రోజుకు రూ.50 చొప్పున ఫెనాల్టీలు వేస్తుధన్నారు. ఒక్కొక్క వాహనం, గత 2,3 సంవత్సరాల నుండి ఫిటనెన్లు పెండింగ్ లు ఉన్నయని, గత రెండు సంవత్సరాలు కరోనా వలన, ఆటో, క్యాబ్, లారీ, మినీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ కం డ్రైవర్ గా పనిచేసే కార్మికులు తీవ్రమైన నష్టాన్ని చవిచూసారని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం 2022 మే 19 తేదీనా తెలంగాణ రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ, మినీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

also read ;-ఆ ఇద్దరికి నో చాన్స్

బందును జయప్రదం చేయాలని కోరుతూ 19 వ తేదీ ఉదయం 9 గం కు ఎన్టీఆర్ సర్కిల్ నుండి కొత్త బస్టాండ్, డి.ఆర్.డి.ఏ, మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు, ఇందిరా నగర్, రోటరీ నగర్ మీదుగా శ్రీ శ్రీ సర్కిల్ వరకు మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాల ర్యాలీ ఉంటుందని కనుక అందరు కార్మికులు తమ తమ యూనియన్ల జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ మినీ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పేరూరి సోమరాజు, సోమ సాయి కుమార్ ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ కార్యదర్శుల పానుగంటి శ్రీనివాస్, నేలల వెంకట్, సహాయ కార్యదర్శి మద్దనపు నరేష్, కోశాధికారి కాంపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.