Telugu News

వనజీవి రామయ్యను పరామర్శించిన మంత్రులు

== హాజరైన ఎంపీ నామా, ఎమ్మెల్యేలు

0

వనజీవి రామయ్యను పరామర్శించిన మంత్రులు

== హాజరైన ఎంపీ నామా, ఎమ్మెల్యేలు

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
పద్మశ్రీ అవార్డు గ్రహిత, వనజీవి దరిపల్లి రామయ్యను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద బుధవారం ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు తన మోటర్ సైకిల్ తో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన మోటర్ సైకిల్ బలంగా ఢికొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వనజీవి రామయ్యను స్థానికులు 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

also read :-సీఎంకు నేను దన్యుణ్ని

కాగా తక్షణమే స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లకు పోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరిపల్లి రామయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణమే మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. అయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఇద్దరు మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మంలో హెలికాప్టర్ దిగగానే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వనజీవి రామయ్యను కలిసి మాట్లాడారు.

also read :-రాజ్యసభకు గాయత్రి రవి నామినేషన్

ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఆఫీసర్, వైద్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులు మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు మంత్రులకు తెలిపారు. జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు హాజరైయ్యారు.