Telugu News

అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారుల వాటా ఎంత?

ఆదివాసీ చట్టాలను అమ్ముకుంటున్న అధికారులు

0

అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారుల వాటా ఎంత?

 

— ఆదివాసీ నవనిర్మాణ సేన

ఆదివాసీ చట్టాలను అమ్ముకుంటున్న అధికారులు

(నూగూరు వెంకటాపురం-విజయం న్యూస్)

భారత రాజ్యాంగం ఆదివాసీల అభివృద్ధి కంటే ఆదివాసీల అస్థిత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆదివాసీల అస్థిత్వాన్ని కాపాడేందుకు రక్షణగా 1/70 ,పెసా లాంటి బలమైన చట్టాలను తెచ్చినా అమలు చేసే అధికారులు గిరిజనేతరులు కావడం వల్లనే అవి అమలుకు నోచుకోవడం లేదని , షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ అధికారులను మాత్రమే నియమించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్శా నర్సింహ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల అధ్యక్షులు ముర్రం రాజేష్ అధ్యక్షతన వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన ఆయన పై విధంగా స్పందించారు. వెంకటాపురం మండల కేంద్రంలో వలస గిరిజనేతరులు ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పంచాయతి ,రెవిన్యూ అధికారుల్లో ఎటువంటి చలనం లేదన్నారు.

also read;-న‌ర్సంపేట దుర్ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్ర‌బెల్లి తీవ్ర దిగ్భ్రాంతి

చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారుల్లో తీవ్ర అలసత్వం రాజ్యమేలుతోంది అని మండిపడ్డారు. ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘనను అడ్డుకోని అధికారుల వాటా ఎంత అని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేసే చిత్త శుద్ధి అధికారుల్లో కొరవడింది అని అన్నారు. ఆదివాసీ చట్టాలను అమలు చేయకుండా అధికారులు అమ్ముకుంటున్నారని అధికారుల పై ధ్వజమెత్తారు. ప్రాచీన కాలం నుండి మైదాన ప్రాంత గిరిజనేతరుల దూరాక్రమనలు నేటికి ఏజెన్సీ లో కొనసాగుతున్నాయని అన్నారు. వలస గిరిజనేతరులు అధికారుల అండదండలతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాల తో పాటు, అక్రమ వ్యాపారాలు చేస్తూ ఆదివాసీల అస్థిత్వాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. ఆదివాసీల శ్రమను ,సంపదను దోచుకుంటూ లక్షల రూపాయలు కూడ పెట్టుకుంటున్నారని తెలియజేశారు.పట్టణ ప్రాంత మున్సిపాలిటీల్లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో బలమైన పార్లమెంట్ చట్టం ఉండి కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన అధికారుల పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాలకు మౌఖిక ఆదేశాలు ఇస్తూ అందినకాడికి అధికారులు డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. ఆదివాసీ చట్టాలను అధికారులు గిరిజనేతరులకీ తాకట్టు పెడుతున్నారని అన్నారు.

also read;-కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 714 వెంటనే రద్దు చేయాలి…!

త్వరలోనే ఎల్టీఆర్ చట్టాన్ని అమలు చేయని అధికారుల భరతం పడతామన్నారు. ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘనకు సహకరిస్తున్న అధికారుల అవినీతి చిట్టా తమ దెగ్గర ఉందని , ఆదివాసీ నవనిర్మాణ సేన అందుకు బాద్యులైన అధికారులను న్యాయస్థానంలో దోషులుగా నిలబెట్ట నున్నట్లు తెలియపర్చారు. వేలాది మంది ఆదివాసీల ప్రాణ త్యాగాల ఫలితం నేటి ఆదివాసీ చట్టాలు. వారి ప్రాణ త్యాగాలను చులకన చేయాలని చూస్తున్న అధికారులు ఎంతటి వారు అయినా న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే అని హెచ్చరించారు. ఆదివాసీ చట్టాలను ,వేలాదిమంది ఆదివాసీల ప్రాణ త్యాగాలను హేళన చేస్తూ ,చట్టాలను అమలు చేయని అందుకు బాద్యులైన ఉద్యోగుల మీద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు నరేష్ మండల ఉపాధ్యక్షులు చేలే రాజేష్, ప్రధాన కార్యదర్శి నాగుల పవన్, కార్యదర్శులు పూనేం మహేష్, వాసం చక్రి ముర్రవాని గూడెం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.