Telugu News

===కిష్టాపురం గ్రామంలో నిరుపేదలు హాల్ చల్

== డబుల్ బెడ్ రూమ్ విషయంలో అధికారులు మోసం చేశారని ఆందోళన

0

===కిష్టాపురం గ్రామంలో నిరుపేదలు హాల్ చల్
== డబుల్ బెడ్ రూమ్ విషయంలో అధికారులు మోసం చేశారని ఆందోళన
== పురుగులమందు డబ్బాతో ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్న ఓ వ్యక్తి
== ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, సర్పంచ్
===(కూసుమంచి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కృష్ణాపురం లో డబల్ బెడ్ రూమ్ వద్ద నాగరాజు అనే వ్యక్తి పురుగుల మందు డబ్బా తో ఆందోళన. చేశాడు. తను లేనివాడినని పేద వాడినైననాకు ఇల్లు ఇవ్వకుండా ఆస్తులు ఉన్నవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారని డబల్ బెడ్ రూమ్ ఇంట్లో తలుపులు వేసుకొని నాగరాజు పురుగుల మందు డబ్బుతో ఆందోళన.చేస్తున్నాడు. నాగరాజు ను కాపాడేందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు చుట్టుముట్టిన గ్రామస్థులు నచ్చజెప్పితున్నారు.

also read;-పల్లెల్లో మారుతున్న రాజకీయం………

గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి రాత్రికి రాత్రి వెళ్ళమని అధికారులు లిస్ట్ లో కేటాయించిన కొంతమందికి ఇండ్లలోకి వెళ్లిమని తాళాలు ఇచ్చినట్లు సమాచారం… అధికారులు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా రాత్రికి రాత్రి లబ్ధిదారులకు ఇండ్లలోకి వెళ్ళిందుకు తాళాలు ఇవ్వడంపై ఆగ్రహించిన గ్రామస్తులు.. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ ను వివరణ కోరగా గ్రామ సర్పంచ్ కి సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులు కావాలనే మా ఊరిలో గొడవలు పెట్టేందుకు రాత్రికిరాత్రే ఇండ్లను పంపిణి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అనేక దఫాలుగా ఫిర్యాదులు చేశామని, సర్పంచ్ కి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొడవ చేస్తున్న నాగరాజు, వారి బందువులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం చేస్తామని, ఎలాంటి ఇబ్బంది చేసుకోవద్దని పోలీసులు నాగరాజును సూచిస్తున్నారు