Telugu News

ఐకెపి సెంటర్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

విజయం న్యూస్ మల్లాపూర్

0

ఐకెపి సెంటర్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

(విజయం న్యూస్ మల్లాపూర్);-

కుస్తాపూర్ ఐకెపి సెంటర్ ని జగిత్యాల అడిషనల్ కలెక్టర్ బి. లత సందర్శించారు. ఐకేపీ కేంద్రములో ఉన్నటువంటి ధాన్యాన్ని,అలాగే సెంటర్ కు వచ్చేటువంటి ధాన్యమును తొందరగా రైస్ మిల్లులకు పంపే ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్వాహకులకు , ఐకెపి ఏపీఎం కు సూచనలు చేశారు.ధాన్యం పేరుకుపోకుండా చూడాలని, వెనువెంటనే ధాన్యాన్ని తరలించాలని కోరారు.

also read;-కోనసీమలో విధ్వంస ఘటనల వెనుక ఉన్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలి.

రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని,వర్షాల పట్ల జాగ్రత్త వహించి ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్ లను అందించలాని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్,తహశీల్దార్ రవీందర్,గ్రామ సర్పంచ్ ,ఐకేపీ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.