Telugu News

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యునిగా గజ్జెల. రాజశేఖర్……

విజయం న్యూస్ - తాడ్వాయి

0

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యునిగా గజ్జెల. రాజశేఖర్……

(విజయం న్యూస్ – తాడ్వాయి):-

 

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, జంపంగావాయి (కొత్తూరు) గ్రామానికి చెందిన గజ్జెల రాజశేఖర్ (విజయం-రిపోర్టర్) ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యూ జె ఎఫ్) ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజె ఎఫ్) ద్వితీయ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఇందులో తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని జంపంగవాయి(కొత్తూరు) గ్రామానికి చెందిన జర్నలిస్ట్ గజ్జెల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

also read :-మత్స్యకారుడు దారుణ హత్య

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుడు గజ్జల రాజశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా నిరంతరం ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎల్లప్పుడూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.