ఎన్టీఆర్ విగ్రహంపై పాలి‘ట్రిక్స్’
== ఈనెల 28న ఎన్టీఆర్ విగ్రహాన్ని అవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్
== అదే రోజున ఏపీలో మహానాడు ముగింపు
== ఖమ్మం పర్యటన వెనకాలా టిఆర్ఎస్ వ్యూహం ఉందా..?
== తెలంగాణ లో టీడీపీ పై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారా..?
== ఎన్టీఆర్ ను బీఆర్ఎస్ ఆకర్షిస్తుందా..?
== పువ్వాడ ఆంజనేయ పాత్ర వహిస్తున్నాడా..?
== కెసిఆర్ వ్యూహం ఏంటి..?
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతుందా…? అందులో భాగంగానే నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా చేసుకొని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? ఖమ్మంలో జూనియర్ ఎన్టీఆర్ పర్యటన అందుకు సంకేతమైనా..? తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమం ముగింపు రోజున ఖమ్మంలో ఎన్టీ రామారావు అత్యంత పొడవైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కావడం వెనకాల రహస్యం ఏంటి..?
ఇది కూడా చదవండి: కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునర్ వైభవం రాకుండా ముందస్తుగానే వ్యూహత్మకమైన అడుగులు వేస్తున్నారా..? ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ చేస్తున్న రాజకీయ వ్యూహం ఏంటి..? సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయి..? ఖమ్మంలో ఏం జరుగుతోంది..? ఖమ్మం జిల్లా ప్రజల మధ్య జోరుగా జరుగుతున్న చర్చపై ‘విజయం’ తెలుగుదినపత్రిక అందించే ప్రత్యేక కథనం ఇది.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలుగునాట సినిదేవుడు నందమూరి తారకరామారావు భారీ విగ్రహాన్నిఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు.. ఆయన జయంతి రోజున విగ్రహాన్ని అవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారు.. ఎన్టీఆర్ అంటే అందరికి అభిమానమే.. పార్టీలకు అతీతంగా ఆయన్ను దేవుడుగా, సినిస్టార్ గా ఆరాధిస్తారు.. అలాంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని క్రిష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తుండటంతో విమ్మర్శలు ప్రారంభమైయ్యాయి.. యాదవ సంఘం నాయకుల్లో కొందరు క్రిష్ణుడి రూపంలో విగ్రహా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాన్ని పక్కన పెడితో మరో కోణంలో చర్చకు దారితీసింది.. ఏపీలో మహానాడు జరుగుతున్న సమయంలోనే.. అదే రోజున నందమూరి తారకరామారావు ఇంటికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి అవిష్కరణం చేసే విషయంపై నేడు హాట్ టాఫిక్ గా మారింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.. అసలు ఆ కథేంటో.. ఒక సారి చూద్దాం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఇది కూడా చదవండి: ఖమ్మం నగరంలో సైకిల్ పై మంత్రి సవారి
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.. అందుకుగాను తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను పావుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని లేకుండా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కన్పిస్తోంది..అందుకు గాను అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను రంగంలోకి దింపి నందమూరి వారసుడ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది. అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆంజనేయుడి పాత్ర పోసిస్తున్నట్లుగా ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన లకారం ట్యాంక్బండ్ నడిబొడ్డున నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని భారీ విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్టించారు. ఈనెల 28న ఆ విగ్రహాన్ని ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ కోసం నందమూరి తారక రామారావు మనవడు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు అంగీకరించారు. దీంతో ఖమ్మం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ ఫీట్ పెరిగింది. విగ్రహాన్ని ప్రారంభించడానికే వస్తున్న ఎన్టీఆర్ రావోద్దని, కచ్చితంగా అడ్డుకుంటామని యాదవ్ సంఘం నాయకులు తీవ్రంగా ఎతిరేఖిస్తున్నారు.
ఇది కూడా చదవండ: సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి
నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏపీలో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటివరకు మహానాడు ను తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నందమూరి వారసత్వం అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మహానాడు కార్యక్రమానికి హాజరై నందమూరి తారక రామారావు నివాళులర్పించిన పరిస్థితి ఉంది. అయితే రాను రాను జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చీతకన్ను చూపించడం, ఆయన్ని ఆయా కార్యక్రమాలకు పిలవకపోవడం తో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ అస్థిరత్వాన్ని కోల్పోయింది. నాయకత్వం మొత్తం పార్టీ మారారు. నాలుగేళ్ళపాటు కార్యక్రమాలు చేయలేదు. కాగా ఇటీవలే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం దృష్టి సారించారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా ఇటువలె తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీని నడిపించాలని, నాయకత్వం వహించాలని జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ రాష్ట్ర టిడిపి నాయకులు పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి: నా జీవితంలో బెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్
ఆయన ఈ నిర్ణయం పై విముకుత వ్యక్తం చేశారు. రాజకీయాలు చేసే సమయం ఇంకా ఉందని ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేనిని జూనియర్ ఎన్టీఆర్ తేలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జూనియర్ ఎన్టీఆర్ ని బీఆర్ఎస్ ఆహ్వానించడం, ఆయన వస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మొదలైందని చెప్పాలి. మహానాడు ముగింపు కార్యక్రమం రోజున ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తుండటంతో కొంత పొలిటికల్ గేమ్ ప్రారంభమైనట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడుకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని రాజకీయ వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఆసరాగా చేసుకుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రాణం పోసుకోకుండా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు తమ్ముళ్ల మధ్య ఆందోళన కలిగిస్తున్నారు మాట వాస్తవం. చూద్దాం రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి అడుగులు అడుగులు వేయబోతున్నారు, సీఎం కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.