చంద్రబాబు పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : ఎమ్మెల్యే కందాళ
== అక్రమ అరెస్టులు సరైంది కాదు
(ఖమ్మం-విజయం న్యూస్)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు.
ఇది కూడా చదవండి:-పేదల సొంత ఇంటి కల గృహ లక్ష్మీపథకం.. మంత్రి పువ్వాడ..
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప రాజకీయంగా వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు.చంద్రబాబు గారిపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును *ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి* తీవ్రంగా ఖండించారు.