తుమ్మలపై మంత్రి పువ్వాడ సెటైర్
== రాజకీయ నిరుద్యోగులు వస్తున్నారోచ్..జర జాగ్రత్త
== ముసలి కన్నీరు కారుస్తారు..సంచినిండా పైసలతో వస్తారు..
== తట్టెడు మట్టి పోయినోడు..అసెంబ్లీ గేటు తాయనీయడంటా.?
== తరిమేందుకు ఖమ్మం ప్రజలు సిద్దంగా ఉండాలి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సెటైర్లు సందించారు.
ఖమ్మం జిల్లాకు రాజకీయ నిరుద్యోగులు వస్తున్నారని, వారందరు ముసలికన్నీరు కారుస్తూ..సంచినిండా పైసలతో వస్తున్నారని.. వారి పట్ల ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వారు పదవిలో ఉన్న అంత కాలం ఖమ్మంలో ఒక్క శిలాఫలకం కూడా నిర్మించలేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ‘షర్మిళ’
ఎంపీగా పనిచేసిన పొంగులేటి ఖమ్మం నియోజకవర్గంలో ఒక్క శిలాపలకం చూపిస్తాడా..? తట్టెడు మట్టి పోశాడా..? అని విమర్శించారు. ఖమ్మంకు తట్టెడు మట్టి కూడా పోయానివాడు అసెంబ్లీ గేటు తకానియను అని అంటుండటం హాస్యాస్పదమని అన్నారు. ముసలి కన్నీరు కారుస్తూ డబ్బు రాజకీయం చేయాలి అని వస్తున్నారు,వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బస్ స్టాండ్ నిర్మాణం కోసం అనేక ఇబ్బందులు పడినం.. అనేక మంది అధికారులను ఇబ్బందులు పట్టి మరి పూర్తి చేసిన. నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారుల వెంట పడిన. వారిని నిత్యం ఇబ్బందులు పెట్టిన అధికారులు పెద్ద మనసు చేసుకుని పూర్తి చేశారని అన్నారు. మధ్యలో కరోనా వచ్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడి నేడు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి 43 వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. హైదరబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్ తరువాత అంత పెద్ద బస్ స్టాండ్ మన ఖమ్మంలోని ఉందని గర్వంగా చేప్పారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మాన్ని హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేస్తా: మంత్రి పువ్వాడ
30 ప్లాట్ ఫాం తో అద్భుతంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఏం చేశావయ్య నీ ఖమ్మం కు అని ఎవరైనా అడిగితే ప్రజలకు అవసరమయ్యే అద్భుతమైన బస్ స్టాండ్ నిర్మాణం చేసినం అని గర్వంగా చెప్తా అని అన్నారు. పక్కనే టూరిజం హోటల్, బహుళ సంస్థల షాపింగ్ మాల్ హోటల్స్ వచ్చినాయని అదే అభివద్దికి నిలువుటద్దమని అన్నారు. ఆర్టీసి సంస్థల అభివృద్ది కోసం రూ.200 కోట్లు రుణం తీసుకుని అభివృద్ది చేస్తాం. మాల్ అండ్ మల్టీప్లెక్స్ లు, కన్వెన్షన్ హాల్స్ ఇలా కమర్షియల్ సంస్థలు ఎర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో ఇంతటి అద్భుత కన్వెన్షన్ హాల్ లేదు.. దాదాపు 2వేల మందికి సరిపడుగా అధునాతన డిజైన్ తో రూ.40 కోట్లతో నిర్మిస్తున్నాం. ఆర్టీసీకి ఆదాయం వస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలం. సంస్థను కాపాడటంతో పాటు రవాణా సౌకర్యాలను సులభతరం చేస్తాం.కొందరు పిచ్చి వెదవలు ఆర్టీసి అస్థులపై కేసీఅర్ కన్నేశాడు అని కారుకూతలు కూస్తున్నరు.. ఆ వెదవలు చెప్తున్నా.. ఆర్టీసి సంస్థ కు ఆస్తులు క్రియేట్ చేసి సంస్థను బ్రతికించిందే కేసీఅర్ అని అన్నారు. …కరోనా కష్టకాలంలో ఆర్టీసి మూసే పరిస్థితి వచ్చిందని, ఎక్కడ బెదరకుండా ప్రభుత్వం తరుపున నిధులు మంజూరు చేసి సంస్థను బ్రతికించింది కేసీఅర్ అని స్పష్టం చేశారు. కేసీఅర్ కాకుండా ఎవరు ఉన్నా ఈ పాటికే సంస్థను ముసివేసే పరిస్థితి వచ్చేదన్నారు. ఆర్టీసి బుస్సులు ప్రతి రోజు 6 లక్షలు డిజిల్ వినియోగిస్తున్నదని, ఒక పక్కన నష్టాలు వస్తున్న ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా నిర్విరామంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని వస్తారు కొందరు.. టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తారని, వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాళ్ళు జిల్లాకు చేసిన అభివృద్ది ఏమీలేదని, ఒక్క శిలాపాలక కూడా లేదు జిల్లాలో అని అన్నారు. చేస్తే కదా ఉండేది. వాళ్ళు కూడా మాట్లాడతారు..
ఇది కూడా చదవండి:- కందాళకు షాడోల భయం
కేసీఅర్ ను గద్దె దింపుతాం.. బంగళాకాతంలో కలుపుతామని ప్రేలాపనలు పేలుతున్నరు. ప్రజలే మీ భరతం పడతారని హెచ్చరించారు. ఖమ్మం చైతన్య పరమైన, లిఫ్ట్ అభ్యుదయ భావాలతో ప్రజలు ఉన్నారు.. విజ్ఞులైన ఖమ్మం ప్రజలకు ఎవరు ఎంటో బాగా తెలుసన్నారు.