Telugu News

ఇల్లెందులో హీటెక్కిన రాజకీయం

పోటాపోటీగా ఆత్మీయ సమ్మెళనాలు

0

ఇల్లెందులో హీటెక్కిన రాజకీయం

== పోటాపోటీగా ఆత్మీయ సమ్మెళనాలు

== ఒక వైపు పొంగులేటి వర్గం.. మరో వైపు ఎమ్మెల్యే వర్గం

== ఆయోమయంలో బీఆర్ఎస్ నేతలు

== చాలా ప్రెస్టేజీగా తీసుకుంటున్న ఇరు వార్గాల నేతలు

(ఇల్లెందు-విజయంన్యూస్)

ఇల్లెందులో రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. ఒక వైపు  రాష్ట్ర వ్యాప్తంగా  ఒక రకమైన రాజకీయాలు నడుస్తుంటే… ఇల్లెందులో మరో విధంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు.. సోమవారం ఇరు వర్గాల నేతలు ఆత్మీయ సమ్మెళనాలను ఏర్పాటు చేయడంతో ఇల్లందులో బీఆర్ఎస్ రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో ఉండగా, ఎవరి మీటింగ్ కు వెళ్లాలో కార్యకర్తలకు, నాయకులకు బోధపడటం లేదు. ఎవరి మీటింగ్ కు వెళ్లిన కంటు అయ్యే అవకాశాలున్నాయని కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పడ్డారు.

ఇది కూడా చదవండి: నేను శీనన్న వెంటే: కోరం కనకయ్య

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇల్లెందు నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కోరం కనకయ్య పోటీ పడగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బానోతు హరిప్రియనాయక్ పోటీ పడి కోరం కనకయ్యపై హరిప్రియనాయక్ విజయం సాధించారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో హరిప్రియనాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోరం కనకయ్య జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించి జడ్పీచైర్మన్ ఎన్నికైయ్యారు. దీంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు బాధ్యతల ఇవ్వగా కోరం కనకయ్యకు, ఆయన వర్గానికి కొంత అవమానాలు ఎదురైయ్యాయి. దీంతో కొద్ది నెలలుగా కోరం కనకయ్య మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయుడిగా మారిపోయారు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా ఉన్న కోరం కనకయ్య, రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ఆయన ఎంపీ పొంగులేటి వర్గంలో చేరిపోయారు. అయితే చైర్మన్ పదవి ఉన్నందు వల్ల న్యూట్రల్ గా ఉంటారని భావించినప్పటికి కోరం కనకయ్య నేరుగా పొంగులేటి వర్గంలో కీలకపాత్ర పోషిస్తూ బహిరంగంగానే తిరుగుతున్నారు. అయితే జనవర 1 నుంచి పొంగులేటి ప్రభుత్వంపై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ప్రకటనలు చేయండంతో పాటు ఆ పార్టీకి దూరమైయ్యారు. దీంతో కోరం కనకయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి పొంగులేటి వర్గంలో చేరిపోయారు. కాగా పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, సోమవారం ఇల్లందులో ఏర్పాటు చేశారు.

== పోటాపోటీగా సమ్మెళనాలు

ఒక వైపే పొంగులేటి శ్రీనివాస్ వర్గం కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లెందు శివారులో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, మరో వైపు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ వర్గం ఇల్లెందు మున్సిపల్ కార్యవర్గం మూడు సంవత్సరాల పూర్తి అయినందున ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారు కూడా సోమవారం నిర్వహించడంతో ఇల్లెందులో రాజకీయం వేడెక్కిందని చెప్పాలి. రెండు వర్గాల నాయకత్వం ఒకే రోజున ఆత్మీయ సమ్మెళనం పెట్టడంతో ఇల్లెందులోని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కలవర పడుతున్నారు. ఎటు వెళ్లాలో అర్థం కానీ పరిస్థితిల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

చాలా మంది రెండు మీటింగ్ లకు వెళ్లకుండా ఉంటే మంచిదనే తోవలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు వర్గాల నాయకత్వం కూడా ఈ ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో జయప్రదం చేయాలని, భారీ సంఖ్యలో జనంను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చే వారికి సుమారు 500 చొప్పున పంపిణి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీటింగ్ వద్ద మంచి మందు, విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే రెండు వర్గాల వారు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఇల్లెందులో రాజకీయం రసవత్తరంగా, ఉత్కంఠగా మారింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. చూడాలి..ఎవర్ని ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.