Telugu News

పీకేకి ఇది సాధ్యమేనా..?

పెండ్ర అంజయ్య రాజకీయ విశ్లేషణాత్మక కథనం

0

పీకే కు ఇది సాధ్యమేనా..?

(పెండ్ర అంజయ్య-ఎడిటర్)

ప్రశాంత్ కిషోర్(పీకే).. ఈ పేరు ఇప్పుడు దేశానికే బ్రాండ్ అంబాసీడర్ అయ్యింది.. ఈ పేరు చేబితేనే రాజకీయాల్లో అలజడి కనిపిస్తోంది.. ఆయన ఒక సంచలనం.. ఎవర్నైనా అధికార పీఠం ఎక్కించగలడు.. ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్న ఆ పార్టీని అధికారంలోకి తీసుకరాగల సమర్థుడు.. కాదు కాదు.. రాజకీయ విజ్ఞాని,పరిజ్ఞాని. తన సత్తా ఏంటో మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తాడు.. మామూలుగా కాదు.. వారు  వన్ సైడే.. ఆ విధంగా రాజకీయ మలుపు తిప్పగల సమర్థుడు.. అందుకే ఆయనంటే రాజకీయ ప్రముఖులకు అంత ఇష్టం.. ఆయనతో దోస్తి కోసం రాజకీయ ఉద్దండులు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.. ఆయన చేయ్యి కలిపిండు అంటే అధికారం ఖాయమనుకునే నమ్మకం.. అలా ఎన్నో ఎన్నికల్లో నిరూపించుకున్నాడు కూడా..? నాడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది, నిన్న ఏపీ, పశ్చిమబెంగాల్, కర్నాటక, మహారాష్ర్ట,ఢిల్లీ ప్రభుత్వాలను ఒంటిచేత్తో పవర్ లోకి తీసుకొచ్చిన చరిత్ర అతనిది..? అందుకే దేశమంతా పీకే మయమైంది.. రాజకీయ మేథావులు కూడా పీకే చెంతకు చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. ఆయన సలహాలను తీసుకునేందుకు ఆరాట పడుతున్నారు.. అందుకే ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే..? ఏదైనా ఆయనకు సాధ్యమే అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది..తన తోటలో మొదటిసారి ప్రశ్న మొదలైంది.. అదే “పీకేకు ఇది సాధ్యమేనా..?”.. ఇదే అంశం పై దేశంవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. నేను కూడా అంటున్నా..  నిజంగా “పీకేకు ఇది సాధ్యమేనా..?”

 

2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అనుకున్నది సాధించాడు. భారీ మెజారిటీతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఢిల్లీ, ఆంద్రప్రదేశ్,మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ రహిత పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి సక్సెస్ అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని దేశస్థాయిలో అధికారంలోకి తీసుకొస్తానని ప్రకటన చేసిన పీకే.. ఉన్నట్టుండి అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ చెంతకు చేరాడు. టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యవూకర్తగా పనిచేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే టీమ్స్ ను రంగంలోకి దింపారు. 30 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్టును సీఎం కేసీఆర్ కు అందించిన ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుండి కొద్ది రోజుల పాటు నిశబ్ధం పాటించాడు. నెలల తరబడి కనిపించని ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్రత్యక్షమై దేశ వ్యాప్తంగా అందరికి జలక్ ఇచ్చాడు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ, రాహుల్ గాంధీతో అత్యవసరంగా సమావేశమై యావత్తు దేశ ప్రజలను తనవైపుకు తిప్పుకున్నాడు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు సిద్దమనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సోనియా, రాహుల్ గాంధీలు జాతీయ స్థాయి నాయకులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి, తర్జనభర్జనల మీద పీకే వ్యూహకర్తగా అంగీకరించాలా..? లేదా..? అనేదానిపై చర్చిస్తున్నారు. ఇక అంతే దేశంలో ఈ కలయిక సంచలనమైంది.. పెద్ద ఎత్తున విశ్లేషణలు ప్రారంభమైయ్యాయి. ఒక వైపు బీజేపీ, మరో వైపు టీఆర్ఎస్ పార్టీలు అంతర్మథనంలో పడిపోయాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి పీకే బారీ షాక్ నిచ్చినట్లైంది. గత కొద్ది రోజుల క్రితమే ఒప్పందం చేసుకున్న పీకే ఇప్పుడు కాంగ్రెస్ చెంతకు చేరడమేంటనీ టీఆర్ఎస్ నాయకత్వం షాక్ గురైంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు పీకే వ్యూహకర్తగా ఉంటానని చెప్పడంతో ఆ పార్టీలో జోష్ వచ్చింది.. నాయకత్వంలో జోష్ కనిపించింది. కార్యకర్తలు, నాయకులు అంతా సంతోషంగా ఉంటున్న తరుణంలో పీకే మరో షాక్ ఇచ్చారు.నోరుజారా.. నన్ను క్షమించండి.. ఎంపీ ధర్మపురి అర్వింద్
మూడు రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా మకాం వేసిన పీకే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సోనియా,రాహుల్ తో బేటీ సంచలనంగా మారినప్పటికీ పీకే మాత్రం బీజేపీ పార్టీకి దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, రాజకీయ నాయకుల షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్న పీకే, ఆ తరువాత ఢిల్లీ నుంచి నేరుగా బయలుదేరి హైదరాబాద్ చేరుకుని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ కు పయనం కావడం, సీఎం కేసీఆర్ తో సమావేశం కావడం మరింత చర్చకు దారితీసింది. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అంతర్గతంగా జరిగిన సమావేశంలో ఏం జరిగిందో ఏమో..? కానీ రాష్ట్రంలోని అటు టీఆర్ఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తున్న బీజేపీ పార్టీకి చెమట్లు పట్టినట్లే కనిపిస్తోంది. పీకే కాంగ్రెస్ గూటికి ఎందుకు వెళ్లినట్లు, అక్కడ నుంచి నేరుగా వచ్చి కేసీఆర్ ను కలవడమేందుకు అని రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ నాయకులు, కార్యకర్తలు తలలు బాదుకుంటున్నారు. రాష్ర్ట్రంలో ఏం జరుగుతోంది అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ను పీకే కలిపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు అంటుంటే కాదుకాదు ముందుగా టీఆర్ఎస్ తో ఒప్పందం రాసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారని, దేశంలో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తారని కొందరు విశ్లేషిస్తున్నారు. మరికొంత మంది మాత్రం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేరుగా హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మొత్తానికి పీకే, సీఎం కేసీఆర్ ను కలవడం మాత్రం రాష్ట్రంలో సంచలనంగా మారిందనే చెప్పాలి.. అయితే పీకే కి ఇది సాధ్యమేనా..? నువ్వు బత్తాయివో.. వంకాయవో.. ప్రజలకు తెలుసు..

ప్రశాంత్ కిషోర్ ఒక్క సారి మాటిస్తే తప్పుకోడు.. కష్టమో,,నష్టమో..? ఆ పని పూర్తి చేసే వెళ్తాడని గత 20 ఏళ్ల నుంచి జరుగుతున్న చర్చ. ఇచ్చిన మాటకు కట్టుబడటం, పని పూర్తి చేసి సక్సెస్ కావడమే ఇప్పటి వరకు చూశాము.. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటి సారిగా రెండు పడవలపై కాలు మోపుతున్నట్లు కనిపిస్తోంది.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉంటుంది. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.. జాతీయ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా తెలంగాణ, రాజస్తాన్ రాష్ట్రాలపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఎన్నికల ప్రక్రీయను తెలంగాణ రాష్ర్టంలోని వరంగల్ నుంచి షూరు చేసేందుకు వచ్చే నెల 6న రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో పీకే టీఆర్ఎస్ కు వ్యూహాకర్తగా అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ పీకే శిష్యుడ్ని వ్యూహకర్తగా ఏర్పాటు చేసుకుంది. అయితే ఇంతలో పీకే జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరగడం, సమావేశాలు నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగడం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే కాంగ్రెస్ కొంత సంతోషం వ్యక్తం చేసినప్పటికి అదే కాంగ్రెస్ పార్టీకి పీకే మరో షాక్ ఇచ్చాడు. ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిన పీకే నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కలవడం, గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ తో బేటీ అయ్యి పలు విషయాలపై చర్చించడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. పీకే ఎంటీ..? దేశంలో కాంగ్రెస్ ను కలిసి, నేరుగా హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ ను కలవడమేంటని ఒకింత అశ్ఛర్యాన్ని వ్యక్తం చేస్తూ ఒకరినోకరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. అసలు పీకే ఏం చేయబోతున్నారు..?

రౌడీ మంత్రిని బర్తరఫ్ చేయండి

ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అంగీకరించుకున్న ఒప్పందం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తారని తెలుస్తోంది.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తానని, రాష్ట్రంలో కాంగ్రెస్ కు పనిచేయనని సీఎం కేసీఆర్ కు చెప్పినట్లు సమాచారం. అయితే జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం తెలంగాణ రాష్ట్రంలోనే. ఏపీలో 10శాతంకు కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశంలోనే ప్రధాన నమ్మకం కల్గిన, ప్రస్తుతం కాంగ్రెస్ కు రేసులో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాననంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంగీకరిస్తారా..? అంగీకరిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే పరిస్థితి ఏంటనే ఆలోచనల్లో రాజకీయ విశ్లేషకులు పలు అభిప్రాయాలను చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సపోర్టు చేస్తూ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ కు పనిచేస్తానంటే, ఎంపీ సీట్ల ఎంపిక విషయం కానీ, గెలిపించే విషయంలో పీకే ఎలాంటి స్టేఫ్ తీసుకుంటారు..? అనే విషయం ప్రశ్నార్థికమే. కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కనీసం 17 స్థానాలకు 10 స్థానాలనైనా కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మరీ 10 స్థానాల గెలిచే విధంగా కాంగ్రెస్ కు పీకే సలహా ఇస్తే, స్థానికంగా బలంగా ఉన్న టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? దేశ వ్యాప్తంగా థర్డ్ ప్రంట్ వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్ ఎంపీ స్థానాలను కూడా గెలుపించుకునేందుకు ప్రయత్నం చేయాల్సిందే. 17లో కనీసం 10 స్థానాలైనా గెలవగలిగితేనే దేశవ్యాప్తంగా రాజకీయం చేయగలడు. మరీ కనీసం 10 స్థానాలు గెలిచేందుకు పీకే అటు కాంగ్రెస్ కు సలహా ఇస్తాడా..? ఇటు టీఆర్ఎస్ కు సపోర్టు చేస్తారా..? అనేది సవాలక్ష ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఒక వరలో రెండు కత్తులు విమిడే అవకాశం ఉందా..? అంటే ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. మరీ ఇప్పడు పీకే చేస్తున్న రాజకీయ విశ్లేషణ కరెక్టేనా…? రాష్ట్రంలో అది సాధ్యమవుతుందా..? పీకే ఒకే వరలో రెండు కత్తులను తయారు చేస్తున్నడా..? అంటే అది నిజమేనైప్పటికి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యపడదు..? అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో ఒకరకంగా, దేశంలో ఒక రకంగా వ్యూహకర్తగా ఉంటానంటే కచ్చితంగా ఇది ఆయన జీవితంలో పెద్ద తప్పుగానే భావిస్తున్నాను. ఆయన మెదడులో ఎలాంటి ఆలోచన ఉందో తెలియదు కానీ..ఒకే ఒరలో రెండు కత్తులు ఇమిడే అవకాశమే లేదంటే లేదనే చెప్పాలి. అదే జరిగితే మాత్రం కచ్చితంగా రాష్ర్టంలో అటు టీఆర్ఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ బలపడే అవకాశం లేకపోలేదు. ఒడ్డు ఇవతల నా కొడుకు, ఒడ్డు అవతలా నా సవతి కొడుకు కు పెత్తనం కావాలే అని ఆలోచించిందంటా ఓ తల్లి.. అంతలోనే మేమామ వచ్చి రెండండీని ఎత్తుకపోయిండంటా..? అలా ఉంది పీకే పరిస్థితి.. మరీ కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ ను పీకే ఎలాంటి నిర్ణయాలతో ఒడ్డున పడేస్తారో..? చూడాల్సిందే..?
(పెండ్ర అంజయ్య, ఎడిటర్)