Telugu News

ఖమ్మంలో ముగిసిన పోలింగ్.

** ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటేసిన 738 మంది ప్రతినిధులు.

0

ఖమ్మంలో ముగిసిన పోలింగ్
** ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటేసిన 738 మంది ప్రతినిధులు
** ఓటుకు దూరం 30మంది
** 96.09శాతం పోలింగ్ నమోదు
** అత్యధికంగా కల్లూరులో 99.13శాతం
** ఖమ్మంలో 96.55శాతం, కొత్తగూడెంలో94.57శాతం, భద్రాచలంలో 94.05శాతం పోలింగ్ నమోదు
ఖమ్మం పోలింగ్ కేంద్రంలో ఉదఈక్తత
** పోలింగ్ కేంద్రం వద్ద భట్టి, కాంగ్రెస్ పార్టీ నేతల ధర్నా.. అరెస్టు
** పోలీసుల తీరుపై భట్టి ఆగ్రహం
** మిగిలిన కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
** ఓటేసేందుకు భారులు తీరిన ప్రజాప్రతినిధులు
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):-
ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. శుక్రవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో మొత్తం 96.09శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 768ఓటర్లకు గాను 738 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 30 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

అందులో పురుషులు 220మంది, మహిళలు 440 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 348 ఓట్లకు గాను 334 ఓట్లు పోలైయ్యాయి. 12 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఖమ్మంలో 96.55శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 99.13 శాతం పోలింగ్ నమోదై జిల్లాలోనే అత్యధిక ఓటింగ్ జరిగిన కేంద్రంగా మారింది. కల్లూరు పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 115 ఓట్లు ఉండగా 114 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అందులో ఒక్క ఓటరు మాత్రమే గైరాజరైయ్యారు. అలాగే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 84 ఓట్లకు గాను 79 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదుగురు ఓటర్లు ఓటింగ్ కు రాలేదు. దీంతో 94.05శాతం పోలింగ్ నమోదైంది. అలాగే కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 221 ఓట్లకు గాను 209 ఓట్లు పోలైయ్యాయి.12 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు.
ఓటు హక్కును వినియోగించుకున్నమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో రాష్ర్ట రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలంలో ఎమ్మెల్యేలు పొడేం వీరయ్య, హరిప్రియా, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు, కలెక్టర్,
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సి.సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు.ఎస్.వారియర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, సీసీ కెమోరాలు, అధికారుల పనితీరును పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలను అందించారు.
** ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద భట్టి, కాంగ్రెస్ నేతల ఆందోళన
ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. పోలింగ్ కేంద్రంలో గంటల కొద్ది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని, ఈ విషయాన్ని స్వయంగా అభ్యర్థి పిర్యాదు చేసిన పట్టించుకోకుండా వదిలేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగినందుకు వారిని అరెస్టు చేయడం పై ఆయన త్రీవంగా స్పందించారు. పోలీసులు, అధికారులు మంత్రికి , ప్రభుత్వానికి తొత్తులగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతకంటే ముందుగా రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ కేంద్రంవద్ద ఆందోళన చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
** అన్ని తానై ముందుండి నడిపించిన మంత్రి పువ్వాడ
క్యాంఫ్ కు గోవా తరలివెళ్లిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు శుక్రవారం ఖమ్మం చేరుకున్నారు. వారు ప్రయాణించేబస్సులు నేరుగా భక్తరామదాసు కళాక్షేత్రంలోకి వచ్చి ఆగడంతో వారందరు అక్కడే కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. పక్కనే ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని తానై నడిపించారు. ఓటర్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఓటు వేసే విధానాన్ని ఓర్పుగా చెబుతూ ప్రతి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను వరసగా పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి పంపించి వస్తున్నారు. అలాగే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజ్ మంత్రితో పాటు పనిచేశారు. ఓటర్లను ఓటు వేసే వరకు బాధ్యత తీసుకున్నారు.
** భారీ భద్రత నడుమ పోలింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆద్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1200 నుంచి 1500 మంది పోలీసులను బందోబస్తుగా నిర్వహించారు. ముఖ్యంగా ఖమ్మం పోలింగ్ కేంద్రంలో గొడవలు అయ్యే అవకాశం ఉందని ముందే ఊహించిన పోలీసులు రెండచల భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేసినప్పటికి పోలింగ్ కేంద్రానికి దూరంగా చేయడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.

also read:- ప.గో…జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ లో కీచక ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి.