Telugu News

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

డిసెంబర్ 3న ఫలితాలు

0

తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

== డిసెంబర్ 3న ఫలితాలు

== నవంబర్ 3న  నోటిఫికేషన్ విడుదల..అదే రోజు నుంచి నామినేషన్లు

== ఒకే రోజున అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్

== ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

(న్యూఢిల్లీ-విజయంన్యూస్)

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఐదు రాష్ట్రాల్లో విడతలవారిగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30  పోలింగ్, రాజస్తాన్ లో , చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్, మీజోరం రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.  తెలంగాణ లో నవంబర్ 3న  నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రీయ కొనసాగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

== తెలంగాణలో  షెడ్యూల్ ఇలా..

అక్టోబర్ 9న :   చత్తీష్ ఘడ్, రాజస్తాన్, తెలంగాణ, మీజోరం, మద్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

నవంబర్ 3న  : నోటిఫికేషన్ ..నామినేషన్ల ప్రక్రీయ షూరు

నవంబర్ 10 : నామినేషన్లకు ఆఖరి గడువు

నవంబర్ 13: నామినేషన్ల పరిశీలిన..తిరస్కరణ

నవంబర్ 15: నామినేషన్ల విత్ డ్రా

నవంబర్ 30: పోలింగ్

డిసెంబర్ 3 : రిజల్ట్