Telugu News

ఏన్కూరులో పోలింగ్ ప్రశాంతం

82.96 శాతం పోలింగ్ నమోదు

0

ఏన్కూరులో పోలింగ్ ప్రశాంతం

== 82.96 శాతం పోలింగ్ నమోదు

ఏన్కూరు మే 13(విజయం న్యూస్):
ఏనుకూరు మండలంలో సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు.వృద్ధులు,వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో హస్తానికి “సైకిల్” సపోర్టు..

ఎండలు మండుతుండటంతో ఉదయం పోలింగ్ సమయానికి ముందే పలుచోట్ల ఓటర్లు బారులు తీరి నిలబడ్డారు.ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది.పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి,ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయన వెంట నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు,స్వర్ణ నరేందర్, వేముల కృష్ణ ప్రసాద్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద రావు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, ఏసిపి సాంబరాజు, పోలింగ్ కేంద్రాల ను సందర్శించారు. ఎస్సై బాదావత్ రవి పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించారు.ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.తాసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఎండిఓ రమేష్, సెక్టార్ అధికారులు పర్యవేక్షించారు.82.96 శాతం పోలింగ్ నమోదయింది.