Telugu News

జీళ్ళచెరువు హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

ఉత్తర్హులు జారీ చేసిన ఆర్ జేడీ కె.సత్యనారాయణరెడ్డి

0

జీళ్ళచెరువు హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

ఉత్తర్హులు జారీ చేసిన ఆర్ జేడీ కె.సత్యనారాయణరెడ్డి

విధుల పట్ల నిర్లక్ష్యం.. విద్యార్థుల పట్ల అసభ్యప్రవర్తన కిందా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్హులు

గతంలో విజయం పత్రికలో వరస కథనాలు
(కూసుమంచి-విజయంన్యూస్);-
పవర్ ఉంది కదా అని పరపతి చూపించాలని, నా మాటే వేదం, నేను ఎలా చెబితే అలాగే నడవాలనుకునే వారికి, నడిపించాలని భ్రమలు పడేవారికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ.. ప్రజా పరిపాలనలో పవర్ శాశ్వతం కాదు.. ప్రజలే శాశ్వతం.. పరిపాలన అవకాశం వచ్చినప్పుడు మంచితనంతో ప్రజలను మక్కువ చేసుకుని తమ విధులకు సంపూర్ణ న్యాయం చూపిస్తూ విధులను సద్వీనియోగం చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను మోనార్కును అంటూ ప్రవర్తిస్తే చివరికి అవమానమే మిగులుతుంది.. అచ్చం ఓ ప్రధానోపాధ్యాయురాలుకు ఇదే జరిగింది. కంప్యూటర్ స్పీడ్ యుగంలో నేను ప్రధానోపాధ్యాయురాలును, నేను బాస్ ను నేను చెప్పిందే జరగాలి అనుకొని తప్పులో కాలేసింది.. ఫలితంగా సస్సెన్సన్ గురైంది..

also read  :-పార్టీ ద్రోహి తుమ్మల : బెల్లం వేణు

ఆమెను సస్పెసన్స్ చేస్తూ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి గురువారం ఉత్తర్హులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యయురాలుగా బాధ్యతలు చేపట్టిన ప్రమిళ ఇష్టానుసారంగా పరిపాలన చేసింది. నేను చాలా స్ట్రీక్ట్ అంటూనే చేయాల్సిందంతా చేశారు. విద్యార్థులతో పనులు చేయించడం, మరుగుదొడ్లు కడిగించడం, గ్రామస్తులను పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులంటే గౌరవం లేకపోవడం, ఇష్టానుసారంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుండేది. అయినప్పటికి జీళ్ళచెరువు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు. కానీ ఆమె బాధలను తట్టుకోలేక విద్యార్థులు స్కూల్ కు రావడం మానేశారు.

also read :-ఖమ్మం రూరల్ కచ్చిరుముంగట మస్తు లొల్లి..

దీంతో తల్లిదండ్రులు జీళ్లచెరువు ఉన్నత పాఠశాలను వదిలేసి కూసుమంచి ఉన్నతపాఠశాలకు వెళ్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు.. సుమారు 20 నుంచి 30 మంది విద్యార్థులు కూసుమంచి ఉన్నతపాఠశాలకు వెళ్తున్నారంట ఆ స్కూల్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తుండటం గమనర్హం. అలాగే ఆమె ఇష్టానుసారంగా సెలవులు పెట్టడం, ప్రభుత్వం సెలవు ఇవ్వకపోయినప్పటికి స్వతహాగా సెలవులు ప్రకటించడం జరుగుతండేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో విజయంపత్రికలో వరస కథనాలు కూడా వచ్చాయి.

అయినప్పటికి జిల్లా, మండల విద్యాశాఖాధికారులు ఆమెకు భయపడి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునే అర్హత ఆర్ జేడీ కి మాత్రమే ఉంది. అందుకే ఆమె డీఈవో, ఎంఈవోలకు భయపడేది కాదు. అందులో సీనియర్ కావడంతో ఆమెదే తుది నిర్ణయంగా ఉండేది. దీంతో ఆమె పాఠశాలలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండేదని విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో పాఠశాల పరిస్థితి, విద్యార్థుల చేస్తున్న పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తెలుసుకోవడంతో డీఈవో, ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే ఆమె పై జీళ్లచెరువు ఉన్నత పాఠశాలలో డీఈవో కార్యాలయం నుంచి ప్రత్యేకాధికారులు వచ్చి విచారణ చేపట్టారు. కాగా విచారణ అనంతరం గురువారం ఆమెను సస్పెన్షన్ చేస్తూ ఆర్జేడీ కె.సత్యనారాయణరెడ్డి ఉత్తర్హులు జారీ చేశారు. కాగా కూసుమంచి మండలంలో ఈ ఉత్తర్హులు కొంత అలజడి రేపిందనే చెప్పాలి.