స్వంత గూటికా..?సోదరి గూటికా..? పొంగులేటి దారేటు..?
== గురువు సూచనలో భాగమేనా..?
== కమలం గూటికంటూ కొందరు..కాంగ్రెస్ గూటికంటూ మరికొంతమంది ముమ్మర ప్రచారం
== అంతలోనే మారిన నినాదం
== షర్మిళ గూటిలో చేరినట్లేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చక్కర్లు
== స్వంత గూటిలోనే విపక్షం..పోరపాటు చేయోద్దంటూ వినతులు
== ఊగిసలాటిలో పొంగులేటి..?
== మాటిచ్చారంటున్న ఓ నేత..
==అట్లాంటిదేమి లేదంటున్న పొంగులేటి
== పొంగులేటి దారేటు..? ఫార్ట్ -3
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారేటో..? ఎవరికి అర్థం కావడం లేదు..రోజుకో మలుపు తిరుగుతున్న ఆయన పార్టీ మార్పు.. శనివారం ఓ కొత్త ప్రచారానికి తెరలేపింది.. పొంగులేటి గురువు పార్టీకి లేదా..? ఆయన సోదరి పార్టీలో చేరినట్లే నంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఈనెల 8న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ టీపీలో చేరుతున్నట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది. నాకు పొంగులేటి మాట ఇచ్చారని ఒక వైపు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేయగా, ఏయ్ అలాంటిదేమి లేదు.. అప్పుడే నిర్ణయం తీసుకుంటామా..? ఇంకా మస్తుమందిని కలవాల్సి ఉంది.. వాళ్ల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ అంటూ పొంగులేటి కొట్టిపారేశారు..? అయితే ఆయన రూట్ మాత్రం వైఎస్ బాట వైపే అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. పొంగులేటి దారేటు..? ఫార్ట్ -3 ప్రత్యేక రాజకీయ విశ్లేషణాత్మక కథనం విజయం తెలుగుదినపత్రికలో..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అంటారే.. అది ఇదేనేమో..? పొంగులేటి శ్రీనివాస్ కి రెడ్డికి ధనబలం ఉంది.. జనబలం కావాల్సినంత ఉంది.. రాజకీయ వ్యూహం ఉంది.. ఆయన ఏ పార్టీలోకి వెళ్లిన.. స్వంతంగా పోటీ చేసిన గెలుపు నల్లేరు మీద నడకేనంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.. అధికార పార్టీ అండా ఉంది.. ప్రతిపక్షాల సపోర్టు ఉంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలగం ఉంది.. కుల బలం ఉంది.. కావాల్సినంతా ప్రేమ ఉంది.. కానీ కావల్సిన సమయంలో కరెక్ట్ డిసిజిన్ తీసుకునే దైర్యం లేకుండాపోయింది.. ఇది వాస్తవం.. ఎన్నికలు మరో ఆరు నెలల సమయం ఉన్న తరుణంలో అధికార పార్టీని దిక్కరించి, అధినేతను వదిలేసి వ్యతిరేక బాట పట్టారు.. స్వతంత్రంగా ముందుకు సాగాలనుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థం గాక తలగొక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది..
allso read- రా..రామన్ని.రారా..రమ్మని
ముందుగా ఒక పార్టీ అనుకున్నప్పటికి స్వంత గూటిలోనే వ్యతిరేకత రావడంతో పునరాలోచనలో పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత ఏ పార్టీలోకి వెళ్ళాలో తెల్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది.. ఫలితంగా పొంగులేటి అనుచరులు, కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు.. పొంగులేటి ఎటు వెళ్తారంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. అసలేం జరుగుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అన్ని రకాలుగా ఆరా తీస్తున్నప్పటికి పొంగులేటి దారి మాత్రం ఎవరికి కనిపించడం లేదు.. పొంగులేటి దారేటు..? అనే ప్రశ్నలు తప్ప.. సమాధానాలు ఎటు నుంచి దొరికే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే ఒక్క పార్టీ తలుపులు తెరుచుకున్నట్లుగా కనిపిస్తోంది.. ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో మాట్లాడే మాటలకు.. ప్లెక్సిల్లో బ్యాగ్రౌండ్ కలర్ కు.. నడిచే దారికి.. నేతల చేరికకు ఎక్కడో లింక్ కుదిరినట్లే కనిపిస్తోంది.. అంతేకాకుండా ఆ నేత నాకు మాటిచ్చారని చెబుతున్నప్పటికి, పొంగులేటి మాత్రం కొట్టిపారేస్తున్నారు.. గట్లేట్టుంటది..? అప్పుడే నిర్ణయం తీసుకుంటామా..? అప్పుడే మారిపోతామా..? అదంతా తూచ్ అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. నిజంగా అంత తొందరగా ప్రకటిస్తే నాయకుడేలా అయితారు..జనమంతా తలలు వెంట్రుకలు పీక్కోవద్దు అన్నట్లుగా ఉంది పరిస్థితి..
== స్వంతగూటికా..? సోదరి గూటికా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై రోజుకో మలుపుతిరుగుతుంది.. రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ నాయకుడికి లేనంతగా పాలోయింగ్ సంపాధించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లారంటూ వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారడంలో సందేహమే లేదు..? గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు, గ్రామం నుంచి రాష్ట్రం వరకు పొంగులేటి గురించి చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తునే ఉంది. అయితే ఆయన ఏ గూటికి పయనమవుతారనే విషయంపై స్పష్టత రాకపోయినప్పటికి పొంగులేటి వ్యవహార శైలిలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి.
allso read- శీనన్న ఆ గట్టునా..? ఈ గట్టునా..?
ఆయన స్వంతగూటికి పయనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఉంది.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఏపీలో పార్టీని కొనసాగించాలని, అక్కడ పోటీ చేయించాలని చూస్తున్న తరుణంలో వైఎస్ఆర్ సీపీ పార్టీని కూడా తెలంగాణలో పోటీ చేయించాలనే ఆలోచన వచ్చిందని, అందుకే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాంబంటు అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ రంగంలోకి దించి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఏపీ మీడియా ప్రచారం చేస్తోంది. అది లేదంటే ఆయన సోదరి గూటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన అనుచరులకు టిక్కెట్లు రావాలన్నా, వారందరు గెలవాలన్న కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ టీపీ పార్టీ అయితేనే మేలు అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే చర్చ ముమ్మరంగా జరుగుతుంది.
== షర్మిళకు పొంగులేటి ఇచ్చిన మాటేంటి..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాకు మాటిచ్చారు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం ఉంది.. కచ్చింతంగా వైఎస్ఆర్ టీపీకి భారీగా చేరికలు ఉంటాయని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ మీడియా సమక్షంలో కుండ బద్దలు కొట్టారు. అంతే కాకుండా పొంగులేటి ఈనెల 8న వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ టీపీలో చేరుతున్నట్లుగా ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి అంశం హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్రంలోని ప్రజలందరు పొంగులేటి గురించి మాట్లాడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాంటిదేమి లేదని, నేను ఎవరికి మాటివ్వలేదని, ఇప్పుడే ఏ పార్టీలో చేరడం లేదని, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కొట్టిపారేశారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
allsoread- 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి
అయితే వైఎస్ షర్మిళ మాత్రం అబద్దం చెప్పె అవకాశాలు లేవు.. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన ఆ నేత ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కల్గిన నాయకురాలు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదో మాటిచ్చారు..? అదేంటి..? అని రాజకీయ విశ్లేషకులు తలలు బాదుకుంటున్న పరిస్థితి నేలకొంది.
== వైఎస్ఆర్ ను కొనియాడుతున్న పొంగులేటి..?
బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనంలో సంచలన ప్రకటన చేసిన పొంగులేటి ఆ సమావేశంలో వైఎస్ఆర్ గురించి కూసింత కూడా మాట్లాడలేదు. కానీ వైఎస్ షర్మిళను, వైఎస్ విజయమ్మను రహస్యంగా మీట్ అయ్యారనే వార్తలు వచ్చిన తరువాత జరిగిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే వైఎస్ఆర్ పథకాలను కొనియాడతుండటం పట్ల కొంత ఆసక్తి నెలకొంది. ఏ మీటింగ్ లోనైనా నేను వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరాను అన్నట్లుగా పదేపదే వైఎస్ఆర్ మాటను తీసుకరావడం, ఆయన పథకాల గురించి కార్యకర్తలకు, ప్రజలకు చెబుతుండటంతో ఆయన వైఎస్ఆర్ టీపీ లేదంటే వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.
== స్వంత గూటిలోనే వ్యతిరేక వర్గం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో స్వంత గూటిలోనే పొంగులేటికి వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దీంతో వెనక్కి తగ్గిన పొంగులేటి ఆ తరువాత వైఎస్ఆర్ టీపీ వైపు అడుగులు పడుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా వ్యతిరేకించడం లేదనేది అర్థమవుతోంది.. బీజేపీ అనగానే నియోజకవర్గ ఇంచార్జ్ లు వ్యతిరేకించగా, వైఎస్ఆర్ టీపీ లేదా వైసీపీ అని ప్రచారం జరుగుతుంటే వ్యతిరేక పవనాలు కనిపించకపోవడం కూడా పొంగులేటికి మంచే జరుగుతుందని పలువురు రాజకీయా నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రజలు, ఆయన అభిమానులు వైసీపీ లేదంటే వైఎస్ఆర్ టీపీకి వెళ్తే రిసీవ్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..? పొంగులేటి దారేటో..? వేచి చూడాల్సిందే..?