Telugu News

పొంగులేటిదే పాలేరు… కాంగ్రెస్ దే తెలంగాణ: పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

0

పొంగులేటిదే పాలేరు… కాంగ్రెస్ దే తెలంగాణ

– కందాల గెస్ట్ హౌజ్ కి… కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం

– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

– బతుకమ్మలతో ప్రసాద్ రెడ్డికి ఘనస్వాగతం

– నాయకన్ గూడెంలో గడపగడపకు కాంగ్రెస్

(కూసుమంచి-విజయం న్యూస్):

పాలేరు నియోజకవర్గంలో గెలుపు పొంగులేటి శ్రీనివాస రెడ్డిదేనని… తెలంగాణలో కాంగ్రెస్ అధికారమని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో శనివారం జరిగింది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఎంగిలి పూల బతుకమ్మలు, కోలాట నృత్యాలతో ప్రసాద్ రెడ్డికి ఆ గ్రామ మహిళలు ఘనస్వాగతం పలికారు. వారితో కలిసి బతుకమ్మలాడుతూ వారిని ఉత్సాహపరిచారు.

ఇది కూడా చదవండి:- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి

ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఓడి గెస్ట్ హౌజ్ కి పరిమితమవుతాడన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారం కోల్పొయి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవ్వడం ఖాయమన్నారు. ప్రజల చూపంతా కాంగ్రెస్ వైపే ఉందని తెలిపారు. ఎప్పుడెప్పుడు హస్తం పార్టీకి ఓటు వేయాలా అని ఉవ్విళ్లురుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం దక్కుతుందని హామీ ఇచ్చారు. అనంతరం ప్రవళిక మృతిని నిరసిస్తూ గ్రామంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- అభ్యర్థులు ఎవరైనా పార్టీ గెలుపే లక్ష్యం: పువ్వాళ 

ఈ కార్యక్రమంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు బజ్జూరి వెంకటరెడ్డి, భీష్మా చారి, సుధీర్ రెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, దామోదర్, దేశబోయిన నాగేశ్వరరావు, గడ్డం గంగయ్య, గొల్లపూడి వీరన్న, లింగారెడ్డి, కందుల రాజా, బి. సోమిరెడ్డి, ఎస్.బి రెడ్డి, ఖాదర్ బాబు, సూర్యనారాయణ రెడ్డి, బానోత్ సెట్రామ్, యడవల్లి రామిరెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి తదితరులున్నారు.