Telugu News

ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

పొంగులేటి వ్యూహమేంటి..? ఫార్ట్-2

0

ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

== ఆ పార్టీ వైపు అడుగులు

== గురువు చూపిన దారిలో కసరత్తు

== రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పే అవకాశం

== అసక్తిగా చూస్తున్న పొంగులేటి అభిమానులు, వర్గీయులు

== పొంగులేటి వ్యూహమేంటి..? ఫార్ట్-2

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నా దారి రహదారి..నా రూటే సఫరేట్ అంటూ సినినటుడు రజనికాంత్ సినిమా డైలాగ్ ఉన్నట్లుగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా  నా రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.. ఒక వైపు అధికార పార్టీలో ఉన్నప్పటికి.. మరో వైపే ఒంటరి రాజకీయం కొనసాగిస్తున్నారు.. బలమైన కార్యకర్తల అండ ఉన్నప్పటికి నాయకత్వ బలం ఉన్నా అధినాయకత్వ మద్దతు లేక… అధికార పార్టీలో ఆయన ఆకాశంలో తొక చుక్కగా మారిపోయారు. రోజులు గడుస్తున్న.. ఎన్నికలు ముంచుకోస్తున్న ఆయన దారి ఎటువైపో ఎవరికి అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది..ఆయనను నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పొంగులేటి స్ట్రాటజీ ఎవరికి అర్థం కావడం లేదు.

ఇది కూడా చదవండి: పొంగులేటి నిర్ణయమేంటి..? ఆయన మాటలో అంతర్యమేంటి..?

గ్రామీణ ప్రాంత నాయకత్వానికి స్థానిక ఎమ్మెల్యేల చేత అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోం ది.. అయినప్పటికి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రాజకీయ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను క్షణంగా పరిశీలిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేశ, రాష్ట్ర భవిష్యత్ రాజకీయ పరిణామాల ద్రుష్ట్య అద్భుతమైన వ్యూహాన్ని రచిస్తున్నట్లు కనిపిస్తోంది.. గురువు బోధనలను ఒంటభట్టించుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతికొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేస్తున్న పొంగులేటి.. రాష్ట్ర రాజకీయాలనే మార్చే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు..  అందులో భాగంగానే నూతన సంవత్సర వేడుకలను అసరగా చేసుకుని రాజకీయ భవిష్యత్ పున:నిర్మాణానికి నాంది ఫలికిన పొంగులేటి తన దశను మార్చే నిర్ణయాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

== పొంగులేటి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు చాలా హాట్ టాఫిక్ గా మారిపోయాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక అంతర్యమేంటో..? ఎవరికి అర్థం కావడం లేదు.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నడా..? పార్టీ మారకుండా వేచి చూసే దోరణిలో ఉన్నాడా..?  అనేది ఎవరికి అంతుచిక్కని అంశంగా మారింది.. ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా ప్రకటన చేశారు.  కాగా  ఆయన వ్యాఖ్యలు వెనక  ఓ రహస్యమే దాగి ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన తో పనిచేసే నాయకుందరు పోటీ చేస్తారని చెప్పడం వెనకాల అద్భుతమైన వ్యూహం దాగి ఉన్నట్లు చర్చ జరుగుతోంది..

ఇది కూడా చదవండి: ‘పేట’ కాంగ్రెస్ కు నాయకుడేడి..?

ఆయన ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అందుకు గాను ఆయనకు అత్యంత దగ్గరుండే సన్నిహితులను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

== బీఆర్ఎస్ లో ఖాళీ ఉందా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కుండా నిండి పొంగిపోర్లే పరిస్థితిలో ఉంది. ఉమ్మడి ఖమ్మంలో పది అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ఉండగా,అందులో మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ జనరల్ స్థానం, రెండు ఎస్సీ రిజర్వేషన్ కాగా, ఐదు స్థానాలు ఎస్టీ రిజర్వేషన్ తో ఉన్నాయి. అందులో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుండగా, 8 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అక్కడ ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇక స్థానిక ఎంపి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇందులో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి  స్థానం దొరకడం కష్టంగా ఉన్న సందర్భంలో ఆయన వర్గీయులకు టిక్కెట్లు వచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీలో ఉందా.?? అంటే అది కష్టమేనని అంటున్నారు.. ఇలాంటి సమయంలో ఆయన పోటీ చేయడమే కష్టంగా ఉంది.. పైగా ఆయన తో పాటు ఆయన వర్గీయులు కూడా పోటీ చేస్తారని ప్రకటించడం వెనకాల అసలు కథ ఏంటో, పొంగులేటి వ్యూహమేంటో ఎవరికి అర్థం కావడం లేదు..

== బీఆర్ఎస్ లో పొంగులేటికి సీటు స్థానం ఉందా..?

వైఎస్ఆర్ టీపీ పార్టీ నుంచి తొలిసారి ప్రజాప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు తొలి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీగా సిట్టింగ్ అయినప్పటికి సీఎం కేసీఆర్  టీడీపీ నేతగా ఉన్న నామా నాగేశ్వరరావును పార్టీలో  చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. దీంతో పొంగులేటికి సీఎం కేసీఆర్ హ్యాండ్ ఇచ్చినట్లైంది.. అయితే ఒంటరిగా పోటీ చేస్తారని, ఇతర పార్టీలోకి వెళ్తారని అందరు భావించినప్పటికి ఆయన వెయిటింగ్ చేశారు.

ఆది కూడా చదవండి: బీఆర్ఎస్ లో విందు రాజకీయం..

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఆ తరువాత ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో మరో సారి పార్టీ మారే కథ తెరపైకి వచ్చింది.. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే పొంగులేటి దశదిశను మార్చే ఎన్నికలు మరో ఏడాదిలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థికంగా మారే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు..? మరీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా..?అని అనుకుంటుండగా కచ్చితంగా ఆయన ఓ వ్యూహాత్మకమైన అడుగు వేయబోతున్నారు..

== ప్లాన్-బీ తప్పదా..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ కోసం ప్లాన్ బీ సిద్దం చేసినట్లు కనిపిస్తోంది.అతిత్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే సారి రెండు పార్టీలకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్లాన్ అమలు చేసే యోచనలో పొంగులేటి నిమగ్నమైనట్లు సమాచారం.  మొత్తం నాలుగు అంశాలను పరిగణంలోకి తీసుకున్న పొంగులేటి ఆ నాలుగింటిలో ఏదో ఒక్కటి పైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ నాలుగు అంశాలపై సర్వే చేయించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో సీనియర్ జర్నలిస్టులతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా 1) వైసీపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నడిపించడం.. 2) బీజేపీ పార్టీలోకి వెళ్లడం 3) టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొత్తగూడెం టిక్కెట్ తీసుకోవడం,ఇద్దరికి టిక్కెట్ ఇప్పించుకోవడం..4) కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం. ఈ అంశాలను పరిగణంలోకి తీసుకున్న పొంగులేటి రాజకీయ భవిష్యత్ పై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నాలుగు అంశాలను ఆయన గురువు ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు..

ఆయన ఏదో ఒక్కటి ఫైనల్ చేస్తే ఆ దిశగా అడుగులు వేసేందుకు పొంగులేటి సిద్దమైనట్లుగా విశ్వసనీయ సమాచారం.  అయితే మొదటిది అమలు చేయాలంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. ఏపీలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నట్లు ఈ సారి తెలంగాణలో పోటీ వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలంటే ఆయనతో పాటు ఆయనను నమ్మిన నేతలకు టిక్కెట్లు వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా తీవ్రంగా అవమానిస్తున్న పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఈ నాల్గింటిలో నాల్గొవ అంశంను పూర్తిగా పక్కనబెట్టే అవకాశం లేకపోలేదు. దీంతో మూడవ అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఆ పార్టీలోనైతేనే ఆయనతో పాటు ఆయనను నమ్ముకుని తిరుగుతున్న వారికి టిక్కెట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారడం, వారు తిరిగి చేరే పార్టీ నుంచి ఆయన వర్గీయులందరికి టిక్కెట్లు ఇప్పించుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫ్లాన్ బీ ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై రాజకీయ గురువైన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.అంతే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితులు, జర్నలిస్టులతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. చూద్దాం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో..? రాబోయే రోజుల్లో ఏ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారో..? ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో..? వేచి చూడాల్సిందే..?