గంగమ్మతల్లి జాతరలో పొంగులేటి
-రూరల్ మండలంలో పర్యటన
(ఖమ్మం రూరల్/కూసుమంచి-విజయం న్యూస్);-
తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కస్నాతండాలో జరుగుతున్న గంగమ్మతల్లి జాతరకు హాజరైయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఘనంగా సత్కారించారు. అనంతరం గుమ్మాల అషయ్య కుమారుడి వివాహానికి హాజరైయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వేల్పుల ఆంజనేయులు ఇటీవల మరణించగా కుటుంబసభ్యులను పరామర్శించారు.
-రూరల్ మండలంలో పర్యటన
బుర్ర బిక్షం కుమారుడి వివాహాం ఇటీవల కాగా వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్రనాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, అజ్మీర అశోక్ నాయక్, తోట చిన్న వెంకటరెడ్డి, మద్ది కిషోర్ రెడ్డి, చిడుముల వెంకట్ రెడ్డి, శాబాదు మాధవరెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాణోతు వీరభద్రం, అజ్మీర రామ్మూర్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పొంగులేటి పర్యటన
ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం నగరం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బోనకల్, మధిర, ఎర్రుపాలెం,
వైరా, చింతకాని మండలాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా మండలాల్లో జరిగిన వివాహాది శుభకార్యల్లో పాల్గొన్నారు. ఇటీవల మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో భాదపడుతున్న వారిని, వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని పరామర్శించారు. ఆర్థికసాయాలను అందజేశారు. అదేవిధంగా పలు దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.