బీఆర్ఎస్ కు బాయ్..బాయ్
== బీజేపీ గూటికి పొంగులేటి
== ఈనెల 18న అమిత్ షాతో బేటి
== త్వరలో పార్టీలో చేరిక..? ఖమ్మంలో భారీ బహిరంగ సభ
== అమిత్ షా సమక్షంలో చేరిక..?
== పొంగులేటి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు.. ప్రస్తుత చైర్మన్లు, ప్రజాప్రతినిధులు
== ముందే చెప్పిన ‘విజయం టీవీ, విజయం పత్రిక’
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
అందరు ఊహించిందే..అనుకున్నదే అయ్యింది.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. త్వరలో ఆయనతో పాటు ఆయన వర్గీయులందరు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అదిలోనే హంసపాదు తప్పడం లేదు.. జాతీయ పార్టీని స్థాపించిన అతి కొద్ది రోజులకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరులు పార్టీని వీడేందుకు సిద్దం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు రాజకీయ పెనుమార్పులు తప్పడం లేదనిపిస్తోంది..
ఇది కూడా చదవండి : రాబోవు కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం..: పొంగులేటి
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రభావం అధికంగానే ఉండోచ్చని, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వేలాధి మంది బీజేపీ గూటికి చేరతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనేక రకాలుగా అవమానాలకు గురి చేసినట్లు పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికి ఆయనకు సీటు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి తీసుకుచ్చి ఆయనకు సీటు ఇచ్చి పార్లమెంటరీ పార్టీ నేతగా నియమంచడంతో పొంగులేటి అసహానం వ్యక్తం చేశారు .అంతే కాకుండా ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలకైనా ఎంపిక చేస్తారని భావించినప్పటికి ఫలితం లేకపోయింది.. దీంతో పాటు ఎమ్మెల్యేలు తమ వర్గీయుల పట్ల ఆమర్యాదగా మాట్లాడుతూ హేళనలు చేస్తుండటంతో పొంగులేటి అనేక మీటింగ్లలో అసంత్రుప్తి వ్యక్తం చేశారు.ఆయన వర్గీయు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామిమేరకు ఆయన అవమానాలను భరిస్తూ పార్టీలోనే కొనసాగారు. అయినప్పటికి సీటు విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడ చదవండి:- ‘పాలేరు’ రేసులో ‘ఆ ఇద్దరు’
బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్దమైయ్యారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజీ చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. ఆయనతో పాటు వేలాధి మంది నాయకత్వాన్ని బీజేపీ వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో పొంగులేటి నిమగ్నమైయ్యారు. ఇప్పటికే ఆయనతో తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాలకు ఆశావాహులుగా ఉంటూ పర్యటనలు చేస్తున్న నాయకులు భారీ జనసందోహంతో పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బీజేపీ గూటికి వెళ్లేందుకు ఇప్పటికే సిద్దం కాగా, ఆయా నియోజకవర్గాల్లో అత్యవసర సమావేశాలను నిర్వహించి ప్రజాభిప్రాయసేకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
== 18న అమిత్ షాతో బేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 18న బీజేపీ పార్టీ కేంద్రకమిటీ బాధ్యులు, కేంద్ర హోమంత్రి అమిత్ షాతో బేటి కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఆగ్రనేతలు గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆయనకు కావాల్సిన సీట్ల విషయంలో హామినిచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈనెల 18న ఢిల్లీకి వెళ్లనున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం 5గంటల సమయంలో కేంద్రహోమంత్రి అమిత్ షాతో బేటి కానున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై, పార్టీలో చేరికలు, రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు, మార్పులు చేర్పులు, తెలంగాణ రాష్ట్రంలో అధికార పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చే వారి వివరాలను, పొంగులేటి వర్గీయులకు టిక్కెట్ ఇచ్చే అంశాలను, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వ్యతిరేక పయనాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు, బీజేపీ పార్టీ నాయకత్వం సమన్వయం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
== ఖమ్మం లో భారీ బహిరంగ సభ..?
ఈనెల 18 ఢిల్లీలో కేంద్రహోమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన బల నిరూపన చేసేందుకు ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం నడిబొడ్డు బారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అమిత్ షా ను లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఆహ్వానించే అవకాశం లేకపోలేదు. వారి సమక్షంలో పొంగులేటి, ఆయన తో పాటు నియోజకవర్గాలకు అభ్యర్థులుగా అవకాశం పొందిన నాయకులను పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ గ్రౌండ్ లేదంటే సర్థార్ పటేల్ స్టేడియంను బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
== పొంగులేటి వెంట వీరు కూడా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. బీజేపీ పార్టీలో చేరుతుండగా, ఆయనతో పాటు కొంత మంది ప్రధాన నాయకులు కూడా ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సత్తుపల్లి నుంచి మట్టాదయానంద్, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,తుళ్లూరి బ్రహ్మయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, మధిర నుంచి కోటా రాంబాబు, పాలేరు నుంచి రామసహాయం నరేష్ రెడ్డి, మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఖమ్మం నుంచి లాయర్ నిరంజన్ రెడ్డి, అశ్వరరావుపేట నుంచి అదినారాయణ, ఇల్లందు నుంచి మడత వెంకటేశ్వర్లు, పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వైరా నుంచి రాజశేఖర్ తదితర నాయకులు పార్టీలో చేరే అవకాశంఉండగా, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ చైర్మను, ప్రస్తుత చైర్మన్లు, డైరెక్టర్లు పార్టీ వీడే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కథ ముగిసినట్లే కనిపిస్తుండగా, బీజేపీ పార్టీకి నూతన ఉత్తేజం రానుంది.