Telugu News

కోలాట బృందానికి పొంగులేటి అభినందనలు*

అర్థిక చేయూతనందించిన పొంగులేటి 

0
కోలాట బృందానికి పొంగులేటి అభినందనలు*
== అర్థిక చేయూతనందించిన పొంగులేటి 
(ఖమ్మం-విజయం న్యూస్)
 అన్నవురెడ్డిపల్లిలో జరిగిన కోలాటం పోటీల్లో రాష్ట్రస్థాయి బహుమతిని తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామానికి చెందిన వెంకటాచలపతి కోలాట బృందం సాధించింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల  స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబర్చి  మొదటి బహుమతిని సాధించిన కోలాట బృందాన్ని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం ఓ ప్రకటనలో అభినందించారు.
== నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పొంగులేటి పర్యటన*
*ఖమ్మం:* ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో వర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, చండ్రుగొండ, జూలూరుపాడు మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో జరిగే పలు శుభకార్యక్రమాలతో పాటు పలు బాధిత కుటుంబాలను వరామర్శిస్తారని తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.
ఇది కూడా చదవండి: బండి సంజయ్ విడుదల