Telugu News

ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు

సకుటుంబ సపరివార సమేతంగా ...

0

ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు

*సకుటుంబ సపరివార సమేతంగా …

*- ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబ సభ్యులు*

*- నలుగురు నలు వైపులా*

*- గడప గడపకూ వెళ్ళి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు వివరిస్తూ ముందుకు….*

*- హస్తానికి ఓటు వేసి పొంగులేటిని గెలిపించాలని అభ్యర్థన*

*ఖమ్మం :* సకుటుంబ సపరివార సమేతంగా పొంగులేటి ఫ్యామిలీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసింది…. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రచారంలో జోరు పెంచింది. ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టించేందుకు ఒకే రోజు పొంగులేటి కుటుంబంలోని నలుగురు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఖమ్మం రూరల్ మండలంలోని గణేష్ టౌన్ షిప్ లో పొంగులేటి సతీమణి మాధురి … నేలకొండపల్లి మండలం చెన్నారం, అమ్మగూడెంలో తమ్ముడు ప్రసాద్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, కరుణగిరిలో ప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీ లక్ష్మి….

ఇది కూడా చదవండి:-:తెలంగాణ లో కాంగ్రెస్ దే అధికారం: ప్రియాంక 

తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్ష రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లను వివరిస్తూ ముందుకు సాగారు. అవినీతి బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని కోరారు. హస్తానికి ఓటు వేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలకు వివరించారు. ఇంటింటీ ప్రచారానికి వెళ్లిన పొంగులేటి కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్