పొంగులేటి ఖబర్దార్!
== నీ ప్రవర్తన మార్చుకోకపోతే నాలుక కోసేస్తాం…..
== వామపక్ష గడ్డ లో మతోన్మాదుల ఆటలు సాగనివ్వం
== ఎంపీగా ఉన్నప్పుడు జిల్లా ప్రజలకు,నిరుద్యోగులకు ఏం చేశావ్?
== మాజీ ఎంపి పొంగులేటి కి తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక
( ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
బిఆర్ఎస్ ,కేసీఆర్ పై అవాకులు ,చవాకులు పేలుతే నాలుక కోసేస్తామని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ , ఖమ్మం జిల్లా ప్రగతిశీల బావాలు కలిగిన వామపక్షాల గడ్డలో మతోన్మాద బిజెపి బలపడేందుకు దోహదం చేయటం సరైనది కాదని అన్నారు.ఎటువంటి శ్రమ లేకుండా అధికార పార్టీలతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు సంపాదించి ఖమ్మం జిల్లాలో క్రోనీక్యాప్టలిస్ట్ అవతారం ఎత్తరాని అన్నారు.శ్రీనివాస్ రెడ్డి వ్యాపారాలకు అడ్డొచ్చిన చిన్న చిన్న వ్యాపారస్తులను చంపుతానని బెదిరిస్తూన్నారని ఆరోపించారు.
ఇదికూడా చదవండి: లోక్ సభలో మహిళా బిల్లుపై చర్చకు నామ గట్టిపట్టు
ఖమ్మం జిల్లా ప్రజా, నిరుద్యోగ సమస్యలపై ఏనాడు సీఎం కేసీఆర్ తో చర్చించలేదని కేవలం తన కాంట్రాక్ట్ ల పనులు ,బిల్లుల కోసం మాత్రమే చర్చించారని ఆరోపించారు.శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టు బుద్ధి పోనిచ్చుకోలేదని బిఆర్ఎస్ కు దూరంగా ఉంటూ ఏ పార్టీలో చేరాలో బేరం కుదరలేదని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీ లతో రాజకీయ వ్యాపారం చేసే నువ్వా కేసీఆర్ గారిపై, మా పార్టీ పై విమర్శలు చేసేది అని నిలదీశారు.తన వక్రబుద్ధిని తన తల్లిని, సతీమణి నీ అడిగితే శ్రినన్న ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ లోనే ఉండి వేరే పార్టీలు గెలుపు కోసం కృషి చేసి పార్టీకి ద్రోహం చేశారన్నారు. అతనికి అడ్డొచ్చిన చిన్న చిన్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు.. ఇకనైనా తమ నాయకులపై చేస్తున్న ఆరోపణలు మానుకోకపోతే నాలుక చీరేస్తామని అన్నారు . ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు, లింగనబోయిన సతీష్, పగడాల నరేందర్, మండదపు శంకర్రావు, మంచికంటి నరేష్, నందిగామ రాజ్ కుమార్,కోడిరెక్క ఉమాశంకర్ ,చల్లపల్లి అజయ్ చారి, ఎండీ. అసిఫ్,ఎస్కే. బురాన్, ఈదుల రాజేష్, అలవాల నాగేశ్వరరావు, నెమలికొండ వంశీ తదితరులు పాల్గోన్నారు
ఇది కూడా చదవండి: ఖమ్మం రూరల్ లో భూ ‘గురి’విందలు….