Telugu News

పొంగులేటి సింహం..సింగిల్ గానే వస్తుంది: స్వర్ణకుమారి 

తాతా మదు వ్యాఖ్యలు అర్థరహితం

0

పొంగులేటి సింహం..సింగిల్ గానే వస్తుంది: స్వర్ణకుమారి 

== తాతా మదు వ్యాఖ్యలు అర్థరహితం

== విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ మద్దినేని స్వర్ణకుమారి

(ఖమ్మం -విజయం ప్రతినిధి)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి సింహంలాంటోడని, సింహం సింగిల్ గానే వస్తుంటే.. వాళ్ళు మాత్రం గుంపులుగా వస్తున్నారని, అయినప్పటికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఆయనతో కలిసి నడిపేవారు కానీ భయపడే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ మద్దినేని స్వర్ణకుమారి అన్నారు.

పొంగులేటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బేబీ స్వర్ణ కుమారి మాట్లాడుతూ గత రెండు రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తాతా మధు, బీఆర్ఎస్ నాయకులు మితిమీరి మాట్లాడుతున్నారని ఆరోపించారు.మేము ఇవ్వాలి అనుకుంటే ప్రజలకు, శ్రీనన్న అభిమానులకు వివరణ ఇవ్వాలని ఈ రోజు చెబుతున్నామని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి డబ్బు కోసం, కాంట్రాక్ట్ ల కోసం వచ్చారని అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.రూ. 2900 కోట్ల కాంట్రాక్ట్ లు అందరికీ ఎలా కేటాయించారో మాకు అలానే కేటాయించారని, అందులో పొంగులేటికి కేటాయించిందేమి లేదన్నారు.ఆ  కాంట్రాక్ట్ లలో 6% కమిషన్ తాతా మధుకి ఇచ్చామని, అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలా ఇచ్చామో తెలియజేస్తామన్నారు.హైదరాబాద్ లో ఏ ముఖ్యమంత్రి వేల ఎకరాలు ఆంధ్ర ప్రజలకు విక్రయించింది మన సీఎం కెసిఆరే కాదా అని ప్రశ్నించారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డినీ బీఆర్ఎస్ నాయకులు తడి గుడ్డ పెట్టీ గొంతుకోసిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మిన, పూలు అమ్మిన అంటే తప్పు లేదు కానీ పొంగులేటి కష్టపడి పైకి వస్తె మాత్రం అది తప్పా అని ప్రశ్నించారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగింది అంటున్నారు గత 9 ఏళ్ల నుండి ఎటు పోయారని, మధిర నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉన్న పొంగులేటి నాటి టీఆర్ఎస్ పార్టీకి 80 వేల ఓట్లు తీసుకువచ్చింది పొంగులేటి కాదా..? అని గుర్తు చేశారు.2018 ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి గెలుపుకోసం పనిచేసిన మీరా మమ్మల్ని ప్రశ్నించేదని ఆరోపించారు.

ప్రగతి భవన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డీతో కలిసి సీఎం కెసిఆర్ కాళ్ళు పట్టుకుని, మందు పోసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న తాతా మధు పొంగులేటి పై ఆరోపణలు చేస్తుంటే దెయ్యాలు, వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు.అలాంటి నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డినీ విమర్శిస్తే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని, 10 కి 10 సీట్లు గెలుస్తాం అన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలపై ఉన్న నమ్మకంతో అన్న మాటలు