Telugu News

పొంగులేటి మాటే మా బాట…!

0

పొంగులేటి మాటే మా బాట…!

– శీనన్న వెంటే మా పయనం

– ఉప్పలచెలకకు చెందిన 400 కుటుంబాలు పొంగులేటి గూటికి

– వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్

(ఖమ్మంప్రతినిధి/కొణిజర్ల-విజయంన్యూస్):

 వైరా నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్లకు భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం ఉప్పలచెలకకు చెందిన సుమారు 400కుటుంబాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలకు పొంగులేటి గూటికి చేరారు. కొణిజర్ల మండల పర్యటనలో భాగంగా ఎంపీపీ గోసు మధు, చల్లగుండ్ల సురేష్, రాయల పుల్లయ్య ల ఆధ్వర్యంలో ఉప్పలచెలక గ్రామంలో సోమవారం సాయంత్రం సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి :పొంగులేటి ఖబర్దార్!

రాబోవు రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించనున్న పొంగులేటే తమకు సరైన నాయకుడని భావించి ఆయన మాటే తమ బాటగా ఇక నుంచి ఉ ంటుందంటూ పేర్కొంటూ ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు గుగులోత్ నాగేశ్వరరావు, రాజారాం, శోభన్, వసంత్, మంగ్యానాయక్, బాలాజీ, రాజేందర్ ల సమక్షంలో 400 కుటుంబాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పొంగులేటి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తన పై ఉన్న నమ్మకంతో తనతో కలిసి పయనించేందుకు వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా ప్రతిఒక్క కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొణిజర్ల మండలం పర్యటనలో భాగంగా పొంగులేటి బొట్ల కుంట, సింగరాయపాలెం, తీగల బంజర, మెకాలకుంట, గుబ్బగుర్తి, అంజనాపరం గ్రామాలను సందర్శించారు. పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట బొర్రా రాజశేఖర్, విజయబాయి, ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, ఇంజం విజయ, సర్పంచ్ పరికపల్లి శ్రీను, ఇంజం పిచ్చయ్య, గన్, సురభి వెంకటప్పయ్య, కన్నెగంటి రావు, శ్రీను, నరసింహారావు, బండారు శ్రీను, పగడాల ముత్తయ్య, కొనకంచి మోషే, గడల నరేందర్ నాయుడు, ఇజ్జగాని శివ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి: ఖమ్మం రూరల్ లో భూ ‘గురి’విందలు….