Telugu News

నేడు రాహుల్ గాంధీతో పొంగులేటి భేటి

జూపల్లి, దామోదర్ రెడ్డితో పాటు 50మంది ముఖ్యనాయకులు భేటి

0

నేడు రాహుల్ గాంధీతో పొంగులేటి భేటి

== జూపల్లి, దామోదర్ రెడ్డితో పాటు 50మంది ముఖ్యనాయకులు భేటి

== ఇప్పటికే ఢిల్లీకి చేరిన పొంగులేటి అండ్ టీమ్

== పార్టీలు చేరతారా..? ఇక్కడికే వస్తారా..?

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

ముందుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మాణిక్య రావు ఠాక్రే తో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాహుల్ గాంధీతో భేటీ కానుంది. తెలంగాణలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, చేరికలు, ఎన్నికలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కొత్తగా కొన్ని కమిటీలు, జిల్లాకు ఒక నేతను ఇంచార్జ్ లను నియమించే విషయంపై చర్చించనున్నారు. రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్దులు కావాలనే విషయంపై రాహుల్ గాంధీ అఫైర్స్ కమిటీ కి దిశా నిర్దేశం చేయనున్నారు.  ఆ సమా  సమావేశం అనంతరం పొంగులేటి, జూపల్లి తో భేటి కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై, కేసులపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి:- షర్మిళ..విలీనామా..? విహారమా..?

సీట్ల విషయంలో పొంగులేటి రాహుల్ గాంధీకి రిక్వస్ట్ చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీ కి వివరించనున్నారు.

== ఢిల్లీలో మకాం వేసిన నేతలు

రాహుల్ గాంధీ తో మీట్ అయ్యేందుకు ఢిల్లీ కి వెళ్ళిన కొంత మంది నాయకులు అక్కడే మకాం వేశారు. పొంగులేటి, జూపల్లి వేర్వేరు హోటళ్లలో మకాం వేశారు.

ఇది కూడా చదవండి:- పొంగులేటికి ఆ సీట్లు ఓకే..?

పొంగులేటితో పాటు ఆయన అనుచరులు సుమారు 40మంది, జూపల్లితో పాటు మరో 10 మంది ముఖ్య అనుచరులు ఆదివారమే హస్తినకు వెళ్ళారు. అక్కడే బస చేశారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు.

== అక్కడ చేరతారా..? ఇక్కడ చేరతారా..?

రాహుల్ గాంధీ తో భేటి కి ఢిల్లీ కి వెళ్ళిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ రోజు పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడే చేరుతారని అందరు ఊహిస్తున్నారు. కానీ ఇరువురు నేతలు సొంత జిల్లాల్లో కార్యకర్తలు, అభిమానుల మధ్య హస్తం గూటికి చేరాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే పొంగులేటి, జూపల్లిని రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది.అలాగే రాహుల్ గాంధీ తో భేటి అనంతరం  ఏఐసీసీ అధ్యక్షుడు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో భేటీ కానున్నారు.పార్టీ చేరికల తేదీ, బహిరంగ సమావేశాలు వంటి వాటిపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి:- సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి 

భేటీ తర్వాత మీడియా సమావేశానికి పొంగులేటి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరి చేరిక తర్వాత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కూడా గుంజేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు? రచిస్తోంది.

ఢిల్లీలోనే ఉన్న ఆ ఇరువురి నేతలను పార్టీ హైకమాండ్ టచ్ లోకి తీసుకునే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు ప్రచారం