రాయలతో పొంగులేటి భేటి..
== కలిసి పనిచేద్దామని ఆహ్వానించిన మాజీ ఎంపీ
== పదేళ్ళ పాటు పార్టీని కాపాడింది రాయల
== ఆయన సేవలను మరవలేము.. ఆయనకు తగిన గుర్తింపు ఉంటుంది
== పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని హామి
== కురుక్షేత్ర యుద్దంలో మనమే హీరోలమన్న పొంగులేటి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యులు, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వ ఆశావాహి రాయల నాగేశ్వరరావును మాజీ ఎంపీ, ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం భేటి అయ్యారు. పొంగులేటి తన నివాసానికి స్వయంగా వెళ్లి రాయలతో భేటి అయ్యారు. ఇంటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాయల నాగేశ్వరరావు ఆత్మీయంగా స్వాగతం పలికి సన్మానించారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్
ఈ సందర్భంగా ఇద్దరు కొద్ది సేపు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాయల నాగేశ్వరరావు తను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని పొంగులేటికి వివరించారు. ఆయన కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అందరు ఎలా కష్టపడి పనిచేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో వివరించారు. 2012 నుంచి పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భావించానని, అందుకు గాను చాలా ఖర్చు చేశానని అన్నారు. అయినప్పటికి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నామని, అధిష్టాన నిర్ణయమే మా అందరి నిర్ణయమన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాయల నాగేశ్వరరావు, పొంగులేటి ద్రుష్టికి తీసుకెళ్లారు. గత మూడు నెలలుగా పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పొంగులేటి తో చర్చించారు. వన్ సైడ్ కార్యక్రమాలను వివరించారు.
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్
పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని అవమానిస్తే ఎలా అని అడిగారు. అయితే దీనికి స్పందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసింది, పార్టీని నిలబెట్టింది రాయల నాగేశ్వరరావు మాత్రమేనని అన్నారు. ఆ విషయం మాకు తెలుసని, కచ్చితంగా మీకు తగిన గుర్తింపు పార్టీలో ఉంటుందన్నారు. మీకు న్యాయం చేసే విధంగా పార్టీని ఒప్పిస్తామని, అందరం కలిసి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేద్దామని అన్నారు. మీతో పాటు మీతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరిని హక్కున చేర్చుకుంటామని, కచ్చితంగా న్యాయం చేస్తామని హామినిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కురుక్షేత్రం రాబోతుంది అనుకుంటూనే అతి కొద్ది రోజుల్లో కురుక్షేత్రం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. ఈనెల 18 వ తేదీ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లా నుండి బస్ యాత్ర నిర్వహిస్తున్నారని, బస్ యాత్ర ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూర్తిస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ లో భారీ కుదుపు
ఆ బస్ యాత్రలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొంటారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, తిని తిని తల్లి తండ్రులు కోచింగ్ సెంటర్ లకు కట్టిన డబ్బంతా బురదలో పోసిన పన్నీరు అయ్యిందన్నారు. యువత అంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 సీట్లు విడుదల చేశారని, కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతో యుద్ధం లోకి దిగుతుందన్నారు. గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్ యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అంతా కాంగ్రెస్ పార్టీని చూసి కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గారెంటీ కార్డ్ లు ప్రవేశ పెడితే అవి ఇవ్వడం ఎలా సాధ్యం అన్న బీఆర్ఎస్ పార్టీ ఎలా చేయగలుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి:- బిగ్ బ్రేకింగ్.. భద్రాచలం లో విషాదం
బీఆర్ఎస్ నాయకులు అంతా మాటలకే పరిమితమైన నాయకులన్నారు. రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి పాలేరులో కష్ట సమయంలో కూడా పార్టీని వీడకుండా అంటిపెట్టుకుని ఉన్నారరని అన్నారు. ఆయన ఒడిపోతానని తెలిసి కూడా ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారని,
కష్టాల్లో ఆయన ఎలా పాలు పంచుకున్నారో సుఖాల్లో కూడా పాలు పంచుకునేలా చేస్తామని హామినిచ్చారు. వందలాది మంది బీఆర్ఎస్ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని అన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు బంధి పోటు అనే పదం వాడే హక్కు ఆయనకు లేదన్నారు. మిమ్మల్ని చూసి మేము భయపడటం కాదు, మీ నాయన, తాతా ఉన్నా బీఆర్ఎస్ నాయకులను మా పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూర్చొని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేలా చర్చలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని హామినిచ్చారు.