Telugu News

జిల్లాలో పొంగులేటి ముమ్మర పర్యటన

- వివాహాది శుభకార్యాలకు హాజరు - నూతన దంపతులకు ఆశీర్వాదం

0

జిల్లాలో పొంగులేటి ముమ్మర పర్యటన
– వివాహాది శుభకార్యాలకు హాజరు
– నూతన దంపతులకు ఆశీర్వాదం

(ఖమ్మం – విజయం న్యూస్) :-

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో జరిగిన పలు వివాహాది శు భకార్యాల్లో పాల్గొన్నారు. కూసుమంచి మండలంలో జరిగిన అప్పగాని రామమూర్తి కుమారుని వివాహానికి, చీమలదారి రామయ్యగౌడ్ కుమారుని వివాహానికి హాజరైయ్యారు. ఖమ్మం రూరల్ లో జరిగిన కూరపాటి వేణు కుమార్తె వివాహానికి, బాణోతు కృష్ణకుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలో జరిగిన సామల పాపారావు కుమారుని వివాహానికి, పల్లి వెంకటేశ్వరరావు కుమారుని వివాహానికి, మద్దెల బుచ్చయ్య కుమారుని వివాహానికి, రేకం అచ్చయ్య కుమారుని వివాహానికి, రామిని శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహానికి, పొగాకు వెంకటకృష్ణ కుమారుని వివాహానికి, ధనియాకుల వీరయ్య కుమారుని వివాహ వేడుకు హాజరైయ్యారు. అదేవిధంగా కొణిజర్ల మండలంలో జరిగిన భూక్యా బాలు కుమార్తె వివాహానికి, కూచిపూడి వెంకటేశ్వర్ల నూతన గృహప్రవేశానికి హాజరై తేనీటి విందును స్వీకరించారు. అనంతరం తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, వైరా మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహాది శుభకార్యాక్రమాలకు హాజరై నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను మాజీ ఎంపీ పొంగులేటి కానుకగా అందజేశారు.

also read :- ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం

also read :-18న ఖమ్మానికి మంత్రి కేటీఆర్‌

ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసుమధు, కార్పొరేటర్ దొడ్డా నగేష్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, తాళ్లూరి రాము, ధారవత్ రామ్మూర్తి నాయక్, అజ్మీరా అశోక్ నాయక్, కూసుమంచి మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, బాణోతు లక్ష్మణ్, భీమనాథుల అశోక్ రెడ్డి, దుంపల రవికుమార్, చింతమళ్ళ గురుమూర్తి, తంబి, నరసింహారావు, రాయల పుల్లయ్య, కన్నగంటి రావు, సైదులు గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కొమరెల్లి లింగారెడ్డి, కొత్త పుల్లారెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, రామ శ్రీను, భద్రం, శేషగిరిరావు, బారీ వీరభద్రం, ఉపేందర్, గోపీ, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.