Telugu News

నిరుద్యోగ యువతకు పొంగులేటి బంఫర్ ఆఫర్

మే 29న మెగా జాబ్ మేళా

0

*నిరుద్యోగ యువతకు పొంగులేటి బంఫర్ ఆఫర్*

*- మే 29న మెగా జాబ్ మేళా*

*- వందకు పైగా కంపెనీల ద్వారా పదివేలకు పైగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కసరత్తు*

*- ఎస్.ఆర్. గార్డెన్స్ వేదికగా జాబ్ మేళా నిర్వహణ*

*- పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వివరాలు వెల్లడించిన పొంగులేటి*

(ఖమ్మం-విజయం న్యూస్):

నేను విన్నాను… నేను ఉన్నాను… అనే నానుడిని మరోమారు రుజువు చేశారు మన ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇటీవల జరిగిన పలు ఆత్మీయ సమ్మేళనాల వేదికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ ఉద్యోగార్థులను చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- తక్షణమే అంటే.. ఎన్ని రోజులు: పొంగులేటి

ఇందులో భాగంగా ఈనెల 29న మెగా జాబ్ మేళాను పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టరును పొంగులేటి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందకు పైగా కంపెనీల ద్వారా ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పదివేల మందికి పైగా నిరుద్యోగులకు ఉ ద్యోగాలు ఇప్పించేందుకు ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. గార్డెన్స్ లో ఈ మేళా 29న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

ఏడవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదువుకున్న వారందరికీ వారి అర్హత, ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9642333667 9642333668 నెంబర్లలో సంప్రదించాలన్నారు. https:/seenannasainyam.com/home_page అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పొంగులేటి కోరారు.