సీఎల్పీ నేతను కలవనున్న పొంగులేటి
== కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్ళి పరామర్శించనున్న పొంగులేటి
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోలుకుంటున్నారు. కాగా బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి చిన్నా రెడ్డి అండ్ టీమ్ కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి:- భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. మరుసటి రోజు గురువారం పాదయాత్ర చేస్తుండగా అస్వస్థత గురైనా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను పరామర్శించేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10.30గంటలకు నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలో పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి*:- కోలుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*