Telugu News

పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?

నెలల తరబడి నాన్చుతూ వస్తున్న పొంగులేటి

0

పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?

== పొంగులేటి దారేటు..?

== నెలల తరబడి నాన్చుతూ వస్తున్న పొంగులేటి

== బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త

== కర్నాటక ఫలితం పైనే ఆయన ఆశలు

== ఖమ్మం ఆత్మీయ సమ్మెళనంలో అధికారిక ప్రకటన

== కాంగ్రెస్ అయితే పదికి పది.. బీజేపీ అయితే పదికి ఒక్కటి అంటున్న జనం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్రమంతా పొంగులేటి వైపు చూస్తోంది.. జనవరి 1 నుంచి నేటి వరకు స్వంత పార్టీపైనే సమరశంఖం పూరించిన పొంగులేటి, వేరే పార్టీలో చేరకుండా నాన్చూతు వస్తున్నారు.. ఊ అంటారా..ఊఊ అంటారా..? మీ దారి ఏటు అంటూ మిత్రులడిగిన, మీడియా అడిగిన.. పార్టీ శ్రేణులు అడిగిన.. ప్రజలు అడిగిన.. ఎవరడిగిన పొంగులేటి మాట మాత్రం ఒక్కటే.. త్వరలోనే నిర్ణయం అంటూ దాటవేస్తూ వచ్చారు.. తన దారేటు..? అంటూ ప్రజలు, అభిమానులు ప్రశ్నిస్తుండగా, మీడియా ప్రశ్నలను కూడా దాటవేసుకుంటూ రాజకీయ భవిష్యత్ గురించి చాలా వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు..

ఇది కూడా చదవండి: రైతులంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు చిన్నచూపు: పొంగులేటి

ఇప్పటికే ఆలస్యమైపోయిందని భావిస్తున్న ప్రజలకు, ఆయన అభిమానులకు అతి త్వరలోనే స్వీట్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని చెబుతూనే నాన్చుతున్నారు..? అసలు ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎప్పుడు చేరతారు అనే విషయంపై ఇంకా ఉత్కంఠ కనిపిస్తోంది.. అయితే ఆ ఉత్కంఠకు తెరదింపే సమయం రానే వచ్చింది.. కర్నాటక ఫలితాల అనంతరం ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. అందులో భాగంగానే ఖమ్మం కేంద్రంగా జరిగే ఆత్మీయ సమ్మెళనంలో ఆయన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు..? ఎప్పుడేళ్తారు..? ఎవరి సమక్షంలో పార్టీలో చేరబోతున్నారనే విషయంపై విజయం తెలుగుదినపత్రిక అందించే ప్రత్యేక కథనం..

తెలంగాణాలో ఒక పక్క ఎండలు వేడెక్కుతుండగా.. మరో పక్క రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఒక వైపు కర్నాటక ఎన్నికలు ముగియ్యడం, మరో వైపు తెలంగాణ లో పదవికాలం ముగింపు దశకు చేరుకోవడంతో మరి కొద్దీ నెలల్లో ఎన్నికల షడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యి డిసెంబర్ లేదంటే జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చేటుచేసుకోనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల చుట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయం తిరుగుతున్నట్లు కనిపిస్తోం ది.

ఇది కూడా చదవండి: బీజేపా..? కాంగ్రెసా..? పొంగులేటి ఎటువైపు..?

వారీద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటిగా బీజేపీ పార్టీలోకి వెళ్తారని అందరు ఊహించినప్పటికి రెండు నెలల తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైయ్యారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఖమ్మం జిల్లా ప్రజలు, అభిమానులు సంబుర పడ్డారు. కానీ పొంగులేటి మాత్రం వేయిట్ చేసే యోచనలోనే ఉండిపోయారు.. వారు మాత్రం తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తరచూ అంటున్నారు. ఇంతలోనే బీజేపీ నేతలు కూడా వారి కోసం పెద్ద ఎత్తున గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో చేరికల కమిటీ నేరుగా పొంగులి నివాసానికి వచ్చిన చర్చించారు. వాళ్లకు కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటించకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.

== సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యమా..?

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేస్తానని , బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పొంగులేటి ,జూపల్లి ఉన్నారు. ఇప్పటికే వివిధరంగాల్లో ఉన్న ప్రముఖులతో సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఓడించాలంటే ఏది బెటర్ , బీజేపీనా ..? కాంగ్రెస్ నా అనేదానిలో ఉన్నారు. చాలామంది సలహాలు తీసుకుంటున్నారు. వారి అనుయాయుల సలహాలు వింటున్నారు . ఇప్పటికే అనేక సమావేశాల్లో వారు తమ విధానాలను వెల్లడించారు. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

== కాంగ్రెస్ లో చేరతారా..? బీజేపీ గూటిలోకి వెళ్తారా..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన గతంలో కాంగ్రెస్ లో చేరే అవకాశ ఉందని తెలిపినప్పటికి వాటిని వాయిదాలు వేసిన పొంగులేటి ఆ తరువాత బీజేపీ నాయకులు ఇంటికి రావడంతో బీజేపీకి వెళ్లే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఆ రెండు పార్టీల వైపు వేచి చూసే దోరణి అవలంభిస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?

కర్నాటకలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అనుచరులకు కూడా చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే 14న ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 13న కర్నాటక ఫలితం రానుండటంతో మరసటి రోజు జరిగే ఆత్మీయ సమ్మెళనంలో అధికారికంగా ప్రకటించాలని భావించారు. కానీ జూపల్లి క్రిష్ణారావు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మెళనం ఈనెల 14న ఏర్పాటు చేయడంతో ఆయన ఈనెల 21న ఖమ్మం లో నిర్వహించాలని భావించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే రోజున పొంగులేటి శ్రీనివసా రెడ్డి అధికారికంగా ఏ పార్టీలో చేరతారో అప్పుడు చెప్పే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

== కాంగ్రెస్ అయితేనే బేస్ట్.. బీజేపీ అయితే వేస్ట్ అని అంటున్న జనం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో పార్టీలో చేరే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. కచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టిలో చేరితేనే బాగుంటుందని, పదికి పది సీట్లు వస్తాయని ప్రజలు చెబుతున్నారు. కానీ ఆయన బీజేపీ పార్టీ లో చేరిన, మరో పార్టీ లో చేరిన, ఇంకో కొత్త పార్టీ పెట్టిన ఆయనకు ఒక్కటి కంటే ఎక్కువ రావని, రాజకీయాల్లో ఓడిపోవడం ఖాయమని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. పొంగులేటి మాత్రం తన వర్కులకు సంబంధించిన అంశంతో పాటు రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా వేగంగా ముందుకు వెళ్తుందని, అందుకే బీజేపీ పార్టీలో చేరితే బాగుంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యోచన చేస్తున్నారు. కానీ అందుకు బిన్నంగా ఆయన వర్గీయులు, సీనియర్ జర్నలిస్ట్ లు, ప్రజలు కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చేరాలని కోరుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో..?