Telugu News

పుడమి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన పొంగులేటి

నవదంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ

0

పుడమి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన పొంగులేటి

== నవదంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ

(ఖమ్మం-విజయంన్యూస్):

కౌలు రైతుల నిజ జీవితంలో జరిగే పలు సంఘటనలను ఉదహరిస్తూ ఆర్. వి. రెడ్డి బ్యానర్లో నంద్యాల సాయి కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం పుడమి. కాగా ఇందుకు సంబంధించిన సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో  ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాను సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా పొంగులేటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బాధ్యులు నంద్యాల సాయి కళ్యాణ్, చింతమళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఇదికూడా చదవండి: సీఎంను వదలని పొంగులేటి

== ఖమ్మం రూరల్ లో పొంగులేటి పర్యటన

ఖమ్మం రూరల్  : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రెడ్డిపల్లి, పల్లెగూడెం తదితర గ్రామాల్లో జరిగిన వివాహా వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దికిశోర్ రెడ్డి, సూదగాని ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గునగంటి రమేష్ తదితరులు ఉన్నారు.

== చింతకాని మండలంలో పొంగులేటి పర్యటన

చింతకాని : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కిష్టాపురం, రామకృష్ణాపురం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో జరిగిన పలు శుభకార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డాక్టర్ కోట రాంబాబు, కన్నెబోయిన సీతారామయ్య, కిలారు మనోహర్, ఎల్. హనుమంతరావు, బూరుగడ్డ లక్ష్మీనారాయణ, గుడిపాటి ఆనందరావు, కోలేటి సూర్యప్రకాష్ రావు, వలమల నాగేశ్వరరావు, కన్నెబోయిన కుటుంబరావు, రవీందర్ రెడ్డి, శెట్టి మోహన్ రావు, పిన్నెల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి: యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి 

== సత్తుపల్లి నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

సత్తుపల్లి :  ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరిగిన పలు శుభకార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, సుధాకర్ తదితరులు ఉన్నారు.