గోరిలపాడుతండా లో పొంగులేటికి జననీరాజనం
== సంక్షేమాన్ని మరిచిన ఈ ప్రభుత్వం మనకొద్దు*
== పథకాలు అమలు కాకప్రజలు గోస పడుతున్నారు
== శీనన్న ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం
== చాంప్లా తండా, గోరీలపాడుతండాలో గడపగడపకు కాంగ్రెస్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి
(కూసుమంచి-విజయం న్యూస్)
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక గ్రామాల్లో రాజకీయ వివక్ష చూపుతూ, సంక్షేమాన్ని విస్మరించి ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. గొరీలపాడు తండా, చాంప్ల తండాల్లో ఆదివారం రాత్రి గడపగడపకు కాంగ్రెస్ లో భాగంగా ప్రచారం చేశారు. స్థానికులు హారతులు పట్టి స్వాగతం పలి కారు. ఇంటింటికీ తిరిగి హస్తం గుర్తుపై ఓటు వేసి పొంగులేటి శీనన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇది కూడా చదవండి:-;ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు
విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ వారు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. మీ పొంగులేటి శీనన్న అందరినీ సమానంగా చూసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ నాయకులు జొన్నలగడ్డ రవి, వెంకటరెడ్డి, పెండ్ర అంజయ్య, తేజావత్ కిషన్ నాయక్, వెంకన్న, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజావత్ మంచా నాయక్, బాసు నాయక్, మాజీ సర్పంచ్ గుగులోత్ బాబు నాయక్, లక్ష్మానాయక్, హఫీజుద్దిన్, బాలాజీ, బానోతు రవి వర్మ నాయక్, పెరిక సింగారం సర్పంచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:-;ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష:- భట్టి