సీఎంను వదలని పొంగులేటి
== నిరుద్యోగుల విషయంలో సీఎంపై ద్వజమెత్తిన మాజీ ఎంపీ
== ఇంటికో ఉద్యోగం అన్నరు.. ఎప్పడిస్తారు..?
== నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఎప్పుడిస్తారు…?
== నోటిఫికేషన్ వేసి.. పేపర్ లీకేజీలు చేస్తారు..
== ఉద్యోగాలివ్వలేకనే పేపర్ లీకేజీ డ్రామా
== మాటలతో మాయలు చేయడం కాదు.. మనసుతో ఆలోచించి పనులు చేయండి
== మెగా జాబ్ మేళా సందర్భంగా సీఎంపై మండిపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సీఎం కేసీఆర్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందు దొరికినప్పుడళ్లా ఆరోపణలు చేస్తున్నారు.. రాజకీయ సభల, సమావేశాళ్లోనే కాకుండా నిరుద్యోగులకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో కూడా సీఎం కేసీఆర్ పై ఓ రెంజీలో ద్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం అంటూ ఉద్యమ సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టిన సీఎం కేసీఆర్, ఫీఠమెక్కిన తరువాత నిరుద్యోగుల నోట్లో మన్నుగొట్టారని ఆరోపించారు. సోమవారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా లో ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులతో మాట్లాడారు.
allso read- అజయ్ నీ వైఖరి మార్చుకో: పొంగులేటి అనుచరులు
అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చూసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు పేరుకు పోయాయని ఆరోపించారు. అన్ని వర్గాల వారిని సీఎం కేసీఆర్ తన మాటలతో మభ్యపెట్టారని, ప్రధానంగా ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని మోసం చేశారన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగుల పట్ల ఎనలేని ప్రేమను కురిపించిన సీఎం కేసీఆర్, ఆ తరువాత ఫీఠం ఎక్కిన తరువాత నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసం…? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉంటే నామ మాత్రపు ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేశారని అన్నారు. దీంతో నిరుద్యోగులు లక్షల రూపాయలు ఫీజులు కట్టి ట్యూషన్లుకు వెళ్లి చదువుకుంటే అంతలోనే పేపర్ లీకేజీలంటూ భయాందోళనకు గురి చేశారని అన్నారు. మళ్లీ అందులోనూ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న తరుపు వారికి ఉద్యోగాలను ఇప్పించేందుకు పేపరును లీకేజీ ని చేయించారని ఆరోపించారు. అంతే కాదు ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగుల పట్ల చవితి ప్రేమను చూపిస్తున్నారని విమ్మర్శించారు. మూడు నెలలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు చర్యలు లేవని, సిట్టింగ్ జడ్జి చే లేదా సీబీఐ చే విచారణ జరిపించాలని గతంలోనూ డిమాండ్ చేశాం… ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఇది కూడా చదవండి: యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి
తినితినక కష్టాలు పడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తే వారి ప్రతిభకనుగుణంగా ఉద్యోగాలను కేటాయించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ లీకేజీ చేయించడం దురదృష్టకరమన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అకౌంట్లో లక్ష రూపాయాలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేలు ఇవ్వాలని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాకుండా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటిని భర్తీ చేసేందుకు కావాల్సిన నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగుల పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. మాటలతో మాయలు చేయడం కాకుండా మనసుతో ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.