Telugu News

నన్ను.. రమ్మంటున్నరు : పొంగులేటి

సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

0

నన్ను.. రమ్మంటున్నరు : పొంగులేటి
== రెండు పార్టీలోళ్లు కలుస్తామంటున్నరు
== పోయేటంత చెడ్డోడ్ని కాదు
== ఇంకా గులాబీ తోటలోనే ఉన్నా..ముళ్లులు గుచ్చుకుంటున్నయ్..అయిన అందులోనే ఉంటా..?
== పోటీ చేయడం ఖాయం ..?
== సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
== రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారిన పీఎస్ఆర్ మాటలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖలు చేశారు.. గతంలో టీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలపై మండిపడిన పొంగులేటి, ప్రస్తుతం ఆ పార్టీ కలవరపడే వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాఫిక్ గా మారారు.. నన్ను మస్తు పార్టీలు తీసుకోవాలని చూస్తరని చెప్పిండు.. గులాబీ తోటలోనే ఉన్నానని, అవి గుచ్చకుంటున్నప్పటికి భరిస్తూ అందులోనే ఉంటున్నానని అన్నారు.. పార్టీలు మారేంత చెడ్డోడ్ని కాదని, అవకాశం కోసం అలాగే కండ్లు కాయలైటేట్టుగా చూస్తున్నఅని అన్నడు..మస్తు బాధతో చెప్పిన పొంగిలేటి  కార్యకర్తల కోసం నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెల్చి చెప్పిండు.. అసలు ఆయనేమన్నరో..?  ఎందుకు ఆయన్ను ఇబ్బందులు పడుతున్నడో..? చూద్దాం..

ఇది కూడా చదవండి : పంజాబ్‌ లో కాంగ్రెస్‌ అందుకే ఓడిందా..?
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలంలో గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మస్తు ఊళ్లల్లో తిరిగిండు.. గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మస్తు మంది దండిగా వచ్చిండ్రు. ఆయనకు గట్టిగా స్వాగతం పలికనరు..పూల అన కురిపించిండ్రూ.. మస్తుగా నినాదాలిచ్చిండ్రూ.. శీనన్న మీ వెంటనే అస్తమని కేకలేసిండ్రూ.. ఊరూరా సంబురంగా ఆయన్ను తీసుకొచ్చిండ్రు.ఆడోళ్లు తిలకం దిద్దిండ్రు, హారతులిచ్చి దీవించిండ్రూ. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో తిరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిండు. నేను జనంతోనే ఉన్నా. జనం కోసం పనిచేస్తున్న. జనం ఏంది చెబితే అది జేసుడే నా పని. నాకంటూ ఏ ఆశలు లేవు.. నన్ను నమ్మినోళ్లు అన్యాయం జరుగుతుందని మస్తుగా మొత్తుకుంటున్నరు.. నేను నా కండ్లతో చూసిన. నాతోను కూడా జిల్లాలో టీఆర్ఎస్ నేతలు అట్టనే ప్రవర్తించుండ్రూ. అయినప్పటికి ఓర్సుకున్న.. మా అభిమానులను ఓర్చుకోమ్మని చెప్పిన. ఎందుకోసమేంటే నమ్మినోళ్లను, నమ్మిన సిద్దాంతాలను పాటించుడే నా పద్దతి. అందుకే నా పద్దతిని కార్యకర్తలకు చెప్పిన. వాళ్లు నా కోసం మస్తుగా బాధపడుతున్నరు. అడుగడుగున అవమానాలను భరిస్తున్నరు..అయినప్పటికి నా కోసం భరిస్తున్నరు. వాళ్ల కోసం నేను పనిచేయకపోతే నాకు విలువుంటదా..? అందుకే వాళ్లను సముదాయిస్తున్న అంటూ సంచలన వ్యాఖలు చేసిండు శీనన్న.

== గులాబీ వనంలో ఉన్న ముళ్ల గుచ్చుకుంటున్నయన్న పొంగులేటి
తాను ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నానని, ఎన్ని ముళ్లు గుచ్చుకుంటున్నాయని, అయినప్పటికి గులాబీ వనంలోనే ఉంటానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. నాకే కాదు నా అభిమానులు కూడా గులాబీ తోటలోనే ఉంటారని అన్నడు. నాకు అవకాశాలు వచ్చేటిది ఉండే కానీ పెద్ద సార్ నా బాగోగులు చూసి నిర్ణయించిండు.. నాకు మంచి అవకాశాలు వస్తయనే భావించిన, ఎదురుచూస్తున్న అంటూ పేర్కొన్నడు.

ఇది కూడా చదవండి : ఉత్తరప్రదేశ్ అందుకే గెలిచిందా..?

గులాబీ పార్టీ కోసమే పనిచేస్తమన్నడు. నమ్మిన పార్టీకి, నమ్మిన నేతకు మోసం చేసుడు మా ఇంటావంట లేదన్నడు. పార్టీ మారుడంటూ ఉంటే ఎప్పుడో మారేటోండ్ని అని చెప్పిండు. పార్టీ మారడం పెద్ద పనేం కాదన్నడు. కానీ విలువలతో పనిచేస్తున్నమని, నమ్మినోళ్లతోనే ఉంటామని చెప్పిండి.

== సీటు రాకపోయిన పోటీ తథ్యం..?
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని నేను మస్తుగా ఆశపడుతున్నా, వస్తందనే అనుకుంటున్న అని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇవ్వకపోయినా జనంలోకి వెళ్లడం తప్పదేమోనని చెప్పిండు. ఎన్నాళ్లు నన్ను నమ్ముకున్నోళ్లు అవమానాలు భరిస్తారు..? వాళ్ల కోసమైన పోటీ చేయాల్సిన అవసరం వస్తదేమోనని అన్నడు. వెళ్లడం ఖాయమని స్పష్టం చేసిండు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ..మంత్రి కేటీఆర్ కానీ పోటీ చేయాలని నాకు చెప్పలేదన్నడు. నాకోసం కాకపోయిన నన్ను నమ్మినోళ్ల కోసమైనా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాని తెలిపిండు.

== ఆ రెండు పార్టీలు నన్ను కలుస్తున్నయ్
గత రెండేళ్లుగా నన్ను రెండు పార్టీల పెద్దనాయకులు నన్ను కలిసేందుకు చూస్తున్నరు.. నాకు సమాచారం కూడా ఇచ్చిండ్రు.. కాంగ్రెస్, బీజేపీ కి చెందిన ఢిల్లీలో పెద్దోళ్లు నన్ను కలవమన్నరు. మస్తుగా బాధ్యతలిస్తమన్నరు. నేను చెప్పినట్లుగా మాటిస్తమన్నరు. కానీ నేను పోలేదు. నాకు అంతవసరం రాలేదని చెప్పిన. సీఎం కేసీఆర్ కు ఇచ్చిన మాటలే నాకు అవసరంమని చెప్పిన అని తెల్చి చెప్పిండు.. సీఎం కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందని, రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నానని తెలిపిండు. బీజేపీ, కాంగ్రెస్ లోకి వెళ్తానని ప్రచారం చేయడం చాలా తప్పన్నడు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిండ్రూ.

ఇది కూడా చదవండి : ‘పాలేరు’ రేసులో స్థానిక నేత..?
== హాట్ టాఫిక్ గా మారిన పొంగులేటి
ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయడం ఖాయమని, రెండు పార్టీల ఢిల్లీ నాయకులు టచ్ లో ఉన్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా చెప్పడంతో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైయినప్పటికి ఒక్క మాట కూడ మాట్లడలేదు. ఎక్కడ కూడా పార్టీ మారుతున్నట్లు గానీ, పోటీ చేస్తానని చెప్పడం కానీ జరగలేదు. అనేక కథనాలు ప్రచురితమైనప్పటికి అందంతా ప్రచారమని కొట్టిపారేశారు. ఎక్కడ కూడా చిన్నంత నోరు కూడా జారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత నాలుగు నెలల నుంచి బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. నన్ను నమ్ముకున్నోళ్లను అవమానాలకు గురి చేస్తున్నరని, పదవులు, పార్టీలు శాశ్వతం కాదని ఓ కార్యక్రమంలో చెప్పిన పొంగులేటి, ఆ తరువాత ఓ కార్యక్రమంలో ఇబ్బందులు పెడుతున్న నేతల సంగతి అభిమానులు చూసుకుంటరని సంచనల నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది. ఆ తరవాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మైనస్ ఓటింగ్ రావడం పట్ల పొంగులేటే కారణమన్నట్లు ఆ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికి ఓపిక పట్టిన పొంగులేటి చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. నా నాయకుడు మంత్రి కేటీఆర్ అని స్పష్టం చేశాడు. వారి అడుగు జాడల్లోనే నడుస్తానని తెల్చి చెప్పాడు. అయితే ఇటీవలే పినపాక నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, పొంగులేటి వర్గీయులకు మధ్య గొడవ కావడం, పొంగులేటి పట్ల రేగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. తలుచుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసని ఇండైరెక్ట్ గా విమర్శ చేశారు. ఆ సంఘటన కూడా సంచలనమైంది. పార్టీ మారేందుకు ఊతమిదే అంటూ ఆ పార్టీ శ్రేణులు భావించారు. కానీ పొంగులేటి పార్టీ మారలేదు.

== జూపల్లి కలియకతో..?
ఇటీవలే రెండు రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పలు రాజకీయ అంశాలను ఛర్చించారు. రాజకీయ భవిష్యత్ పై ఆలోచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెల్చిచెప్పినట్లు సమాచారం. కాగా గురువారం తిరుమలాయపాలెం మండలంలో జరిగిన కార్యక్రమంలో కుండబద్దలు కొట్టాడు. పోటీ చేయడం ఖాయమని తెల్చి చెప్పడం, గులాబీ తోటలోనే ఉన్నాను, ముల్లు గుచ్చుకుంటున్న తప్పడం లేదని చెప్పడం పట్ల శ్రీనివాస్ రెడ్డి స్టాంగ్ నిర్ణయంతో ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చూద్దాం పొంగులేటి అడుగులు ఏటువైపుగా వెళ్తాయో..?