Telugu News

పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించే గొప్ప నాయకుడు ఎంపీ నామ

మధిర నియోజకవర్గంలోని 56 మంది లబ్దిదారులకు రూ .24.98 లక్షల విలువైన చెక్కులు పంపిణీ  , 

0

పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించే గొప్ప నాయకుడు ఎంపీ నామ

పేదల సంక్షేమం కోరే మంచి నాయకుడు మన ఎంపీ నామ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

మధిర నియోజకవర్గంలోని 56 మంది లబ్దిదారులకు రూ .24.98 లక్షల విలువైన చెక్కులు పంపిణీ

పేదల ముఖాల్లో చిరునవులు పూయించాలన్న తపన కలిగిన గొప్ప నాయకుడు మన ఎంపీ నామ నాగేశ్వరరావు అనీ , పేదల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పడే తపన అందుకు సజీవ సాక్ష్యమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు . టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సిఫార్సు తో మధిర నియోజకవర్గంలో 56 మంది లబ్ధిదారులకు రూ”24,98,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి . ఎంపీ నామ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి అధ్యక్షత వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు హాజరై లబ్దిదారులకు చెక్కులు అందించారు .

also reaad :-రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్ల వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు భరోసా గా మారిందనీ , ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోని పేదలకు ఎంపీ నామ క్యాంపు కార్యాలయం ఆసరాగా నిలుస్తోందని అన్నారు . పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాల ప్రజలకు ముఖ్యంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చేరి అప్పులపాలై ఇబ్బందుల్లో ఉన్న పేద , మధ్య తరగతి ప్రజల అందించాల్సిన ముఖ్యమంత్రి కేసిఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి సీఎంఆర్ఎఫ్ చెక్కులు త్వరితగతిన అందించడంలో ఎంపీ నామ తన శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నారని కొనియాడారు . సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ కోసం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు .

also read :- కోలాటమేసిన మంత్రి పువ్వాడ ** వేపకుంట్లలో రైతుబంధు సంబరాలు..**

పేదల మనిషిగా మొదటి నుండీ పేరున్న ఎంపీ నామ తన వద్దకు వచ్చే పేదలకు మరింతగా అందగా ఉండాలన్న తపనలో ఉన్నారని అన్నారు . ఎంపీ నామ ఢిల్లీలో ఉన్నా , హైదరాబాద్ లో ఉన్నా తన కార్యాలయానికి వచ్చే వారికి మాత్రం ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా కృషిచేయడం అత్యంత విలువైన కార్యక్రమం అన్నారు . రాబోవు కాలంలో ఎంపీ నామ మరింతగా పేద ప్రజలకు అండగా నిలవాలని కోరారు . ఇలాంటి గొప్ప నాయకుడు ఉండటం ఉమ్మడి జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని వారు అన్నారు . నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు . ఖమ్మం పార్లమెంట్ లోని నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫార్సు చేసి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి చెక్కులను మంజూరు చేపిస్తున్నారని తెలిపారు .

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ , ముదిగొండ , చింతకాని మండలాల ఎంపీపీ లు సామినేని హరిప్రసాద్ , కాపూరి పూర్ణయ్య , ఎర్రుపాలెం , బోనకల్ , చింతకాని మండల పార్టీ అధ్యక్షులు వంటి సాంబశివరావు , చేబ్రోలు మల్లికార్జున్ రావు , పెంట్యాల పుల్లయ్య , వైరా మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు , ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు , నాయకులు చిత్తరూ సింహాద్రి యాదవ్ , మధిర వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ జంగా రవి , మంకెన రమేష్ , తన్నీరు రవి కుమార్ , పసుపులేటి వెంకట్ , గురిజాల హనుమంతరావు , వంకాయలపాటి లచ్చయ్య , దేవరకొండ చిరంజీవి , బొడ్డు వెంకట్రామయ్య , గడ్డం వెంకటేశ్వర్లు , కొమ్మినేని ఉపేందర్ , సూర్యదేవర సుధాకర్ , భాగం నాగేశ్వరరావు , బంధం నాగేశ్వరరావు , బొర్రా నరసింహారావు , కాళేశ్వరావు , నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , తాళ్ళూరి హరీష్ బాబు , రేగళ్ల కృష్ణప్రసాద్ , పలువురు సర్పంచ్లు , ఎంపీటీసీ లు , ప్రజాప్రతినిధులు , పార్టీ మండలాల ముఖ్య నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు .