Telugu News

పేద కబడ్డీ క్రీడాకారిణి కి ఆర్థిక సాయం

పేద కబడ్డీ క్రీడాకారిణి కి ఆర్థిక సాయం

0

పేద కబడ్డీ క్రీడాకారిణి కి ఆర్థిక సాయం

(కామేపల్లి – విజయం న్యూస్):-

కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి పుచ్చకాయల కృష్ణ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కామేపల్లి మండల కేంద్రంలో క్రీడాకారిణి స్వప్నకు అందజేశారు. ఈనెల 29 నుండి వచ్చే నెల 3వ తారీకు వరకు నేపాల్ దేశంలో జరగనున్న కబడ్డీ పోటీలకు క్రీడాకారిణి ఎంపికైంది. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో నేపాల్ వెళ్లేందుకు అవస్థలు పడుతున్న విషయం తెలుసుకున్న పుచ్చకాయల కృష్ణ , కామేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ రాందాస్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాందాస్ మాట్లాడుతూ.. కామేపల్లి మండలానికి చెందిన స్వప్న అంతర్జాతీయ స్థాయిలో గెలుపొంది

కామేపల్లి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు సుందరం, కాంగ్రెస్ పార్టీ నాయకులు లాలు నాయక్ ,పుచ్చకాయల శ్రీనివాసరావు, పుచ్చకాయల వెంకటకృష్ణ, బొల్లు వెంకటేశ్వర్లు, సింగం వెంకన్న, పుచ్చకాయల కోటయ్య, భాగం ప్రసాద్, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా కారిణి స్వప్న దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ALSO  READ :-మణుగూరు మున్సిపాలిటీ లో అంతా షాడో మయం..