Telugu News

★ పేదల బతుకులు ఛిద్రంచేస్తున్న బీజేపీ

★ బీజేపీ నాయకులు కండ్లులేని కబోదులు

0

★ పేదల బతుకులు ఛిద్రంచేస్తున్న బీజేపీ

★ బీజేపీ నాయకులు కండ్లులేని కబోదులు

★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజం

దేశం, రాష్ట్రంలో అరాచకాలకు బీజేపీ మారుపేరుగా మారిందని, అందుకు ఆ పార్టీ నేతల వ్యవహార శైలే నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దుయ్య‌బ‌ట్టారు. ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వైపు ఉంటే కండ్లు లేని కబోదులైన బీజేపీ వారికి మింగుడు పడడం లేదని మంత్రి ద్వజమెత్తారు.

రాష్ట్రంలో పేదొడికి ఏ ఆటంకం లేకుండా రేషన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ దందా సాగిస్తున్న సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి చౌహాన్ సీఎం అయ్యారని బ‌ల‌వంతంగా విపక్ష ఎమ్మెల్యేల‌ను చౌహాన్ లాక్కొని చోర్‌గా మారారు అని మండిప‌డ్డారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం వ్యాపమ్ ఆయన హయాంలోనే జరిగిందని ఈ విష‌యాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు అని మంత్రి పువ్వాడ గుర్తు చేశారు.

also read;-వనమా రాఘవ ను తక్షణమే అరెస్ట్ చేయాలి..

బీజేపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, వారి భాషను చూసి ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నాటి ఉద్యమ సారధి నేటి ప్రగతి సాధకుడు సీఎం కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారని వివరించారు. బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నదని వారు మాట్లాడే నీతిమాలిన మాటలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు

రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని తెలిపారు. అభివృద్ధి విషయంలో వారికి అవగాహన లేదని, ఇష్టం మొచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదన్నారు.

also read;-అభివృద్ది లో వరంగల్ తూర్పు విక్టరీ.

బీజేపీ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తీరు మార్చుకొకుంటే ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరించారు. అందుకు నిదర్శనమే పంజాబ్ లో జరిగిన ఘటన అని మంత్రి పేర్కొన్నారు. దేశమంతా కరోనా ప్రమాదంలో ఉంటే దేశాన్ని ఏలుతున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలతో మరింత ప్రమాదరక పరిస్థితుల్లోకి దేశాన్ని నేడుతుందని వారు విడుదల చేసిన మార్గదర్శకాలను వారే కాలరాస్తూ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్నదని మంత్రి అజయ్ కుమార్ ఎద్దేవ చేశారు.