Telugu News

ప్రజారంజక బడ్జెట్ : నామా

సంక్షేమానికి దేశ చరిత్రలో కొత్త అధ్యాయం

0

ప్రజారంజక బడ్జెట్ : నామా

సంక్షేమానికి దేశ చరిత్రలో కొత్త అధ్యాయం

ప్ర‌గ‌తిపథంలో తెలంగాణ

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

(విజయం న్యూస్ ఖమ్మం ):-

 

రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనలో దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని, ఒరవడిని సృష్టించిందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇది ప్రజారంజకమైన బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు, మహిళా అభివృద్ధి కి పెద్దపీట వేసింద‌ని కొనియాడారు. రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు లో భాగంగా ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపు పట్ల ఎంపీ నామ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

also read :-ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ : సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

అన్నదాతల సంక్షేమానికి అగ్రస్థానం ఇస్తూ వ్యవసాయ రంగానికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ స్థానం ఇచ్చార‌న్నారు. ఈ ఏడాది రూ.50 వేల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులకు శుభవార్త ను అందించారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూప కల్పన జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆసరా ఫించన్లు కోసం 2022-23 వార్షిక బడ్జెట్ లో రూ. 11728 కోట్లు ప్రతిపాదించడం…. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహాయం చేయాల‌నుకోవ‌డం, నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున కేటాయింపు చేయ‌డం కూడా ఎంతో మంచి నిర్ణ‌య‌మ‌న్నారు. మహిళల కు వడ్డీ లేని రుణాలు అందించేందుకు రూ.187 కోట్లు కేటాయించి సీఎం మహిళా పక్ష పాతి అని తేట తెల్లం అయిందన్నారు.

also read :-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క@మీడియా పాయింట్

కొత్త ఏర్పడ్డ గ్రామ పంచాయ‌తీలు ఒక్కో దానికి 25 లక్షల రూపాయల చొప్పున 600 కోట్లు కేటాయించడం, ప్రతి తండాకు రహదారి నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం పల్లె ప్రగతికి బాటలు వేయడం అన్నారు. బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశా దీపంలా ఉందన్నారు. ఒక వైపు కేంద్రం సహకరించకున్నా ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని పథకాలు సైతం తెలంగాణ లో అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏ విషయంలోనూ అసంతృప్తి చెందకుండా ఉండేలా బడ్జెట్ ఉందన్నారు. 2022 – 23 ఆర్థిక సంత్సరానికి రూ. 2.56 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం సాదారణ విషయం కాదన్నారు. గ్రామీణాభివృద్ధికి రూ.29,586 వేల కోట్లు కేటాయించారని అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అన్నదాతలను గమనంలో ఉంచుకుని రైతు బంధు పధకానికి రూ.24,254 వేల కోట్లు కేటాయిoచడంతో పాటుగా పామాయిల్ సాగు ప్రోత్సహించాలని ఈ బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే ధేయంగా ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందన్నారు. మహిళా అభివృద్ధికి సీఎం అగ్రస్థానం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం లో మొట్ట మొదటి సరిగా రూ.100 కోట్ల తో మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు, కొత్తగా అటవీ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయింపు అభినందనీయమన్నారు. రైతుల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని నామ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ తో తెలంగాణ మరింత ముందుకు దూసుకుపోతుoదని నామ నాగేశ్వరరావు విశ్వాసం వ్య‌క్తం చేశారు.